క్రీడాభూమి

సమీర్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో భారత యువ ఆటగాడు సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి, ఒక్కో అడ్డంకిని సమర్థంగా అధిమిస్తూ ముందుకు సాగుతున్న అతనికి సెమీ ఫైనల్‌లో మూడోసీడ్ ఆటగాడు జాన్ ఒ జొర్గెనె్సన్ ఎదురయ్యాడు. ర్యాంకింగ్స్‌లోనేగాక, అంతర్జాతీయ వేదికలపై తనకంటే ఎంతో అనుభవం ఉన్న జొర్గెనె్సన్‌తో సెమీస్ మ్యాచ్‌ని సమీర్ 43 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. 21-19, 24-22 తేడాతో వరుస సెట్లలో అతనిని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న 22 ఏళ్ల సమీర్ ఒక సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. కెరీర్‌లో తొలి మేజర్ టైటిల్‌పై అతను గురిపెట్టాడు. ఫైనల్‌లో లాంగ్ ఎన్ కాతో సమీర్ తలపడనున్నాడు. మరో సెమీ ఫైనల్‌లో లాంగ్ ఎన్‌కా 21-19, 21-7 స్కోరుతో హు యున్‌పై విజయం సాధించాడు.
మరో టైటిల్ దిశగా సింధు
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరింది. ఈ టోర్నీలో ఎలాంటి సీడింగ్ లేకుండా బరిలోకి దిగిన ఆమె మరో అన్‌సీడెడ్ చెయుంగ్ నాన్యీని 21-14, 21-16 తేడాతో ఓడించింది. సమీర్ మాదిరిగానే సింధు కూడా తన సెమీస్ మ్యాచ్‌ని 46 నిమిషాల్లో ముగించింది. గత వారం చైనా ఓపెన్ టైటిల్‌ను సాధించిన సింధు మరో టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. ఫైనల్‌లో ఆమె నాలుగో సీడ్ తాయ్ జూ ఇంగ్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో నంబర్ వన్ సీడింగ్‌తో ఆడిన ప్రపంచ టాప్ కరోలినా మారిన్‌ను 21-17, 14-21, 21-16 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్ నుంచి సింధుకు గట్టిపోటీ తప్పదు. అయితే, మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న సింధుకే టైటిల్ గెల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు జోస్యం చెప్తున్నారు.