క్రీడాభూమి

మహిళల హాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 27: ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు ఆదివారం జరిగిన చివరి, మూడో టెస్టులో 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సిరీస్‌లో చెరొక విజయాన్ని సాధించిన భారత్, ఆస్ట్రేలియా మహిళలు చివరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగారు. ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆడడంతో మొదటి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో దీపిక, రాణి కలిసి బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఆసీస్ గోల్ పోస్టు సమీపంలో దానిని వందన కతారియాకు పాస్ చేశాడు. ఆమె దానిని సమర్తంగా గోల్ పోస్టులోకి పంపించి, భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ప్రథమార్ధం ఇదే తేడాతో పూర్తయింది.
ద్వితీయార్ధంలో ఆస్ట్రేలియా ఎదురుదాడికి ఉపక్రమించింది. భారత్ తనకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేయగా, 39వ నిమిషంలో బ్రఊక్ పెరిస్, మరో మూడు నిమిషాల్లో గాభీ నాన్స్ గోల్స్ సాధించి, ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కి పెంచారు. ఆతర్వాత కూడా ఆ జట్టు దాడులను కొనసాగించింది. మ్యాచ్ చివరి క్షణాల్లో జోర్డిన్ హోజ్‌బెర్గర్ చేసిన గోల్‌తో 3-1 ఆధిక్యానికి దూసుకెళ్లిన ఆసీస్ అదే స్కోరుతో మ్యాచ్‌ని ముగించింది.