క్రీడాభూమి

డేవిస్ కప్ విజేత అర్జెంటీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాగ్రెబ్, నవంబర్ 28: డేవిస్ కప్ పురుషుల టీం టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను అర్జెంటీనా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. 1900లో మొదలైన ఈ టోర్నీని అర్జెంటీనా 3-2 తేడాతో క్రొయేషియాను ఓడించి తొలిసారి తన ఖాతాలో వేసుకుంది. కీలక మ్యాచ్‌ల్లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, ఫెడెరికో డెల్ బొనిస్ ప్రత్యర్థులను ఓడించి, అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. తొలి సింగిల్స్‌లో క్రొయేషియా స్టార్ ఆటగాడు మారిన్ సిలిక్ చేతిలో ఫెడెరికో డెల్ బొనిస్ 3-6, 5-7, 6-3, 2-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, రెండో సింగిల్స్‌లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో 6-5, 6-7, 6-3, 7-5 తేడాతో ఇవో కార్లోవిచ్‌ను ఓడించి, అర్జెంటీనాను క్రొయేషియాకు సమంగా నిలిపాడు. కాగా, డబుల్స్ విభాగంలో మారిన్ సిలిక్, ఇవాన్ డోడింగ్ జోడీ 7-6, 7-6, 6-3 స్కోరుతో ఆధిక్యంతో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, లియోనార్డో మేయర్ జోడీని ఓడించి, క్రొయేషియాను 2-1 ఆధిక్యంలో నిలబెట్టారు. దీనితో చివరి రెండు రివర్స్ సింగిల్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదటి రివర్స్ సింగిల్స్‌లో జవాన్ మార్టిన్ డెల్ పొట్రో 6-7, 2-6, 7-5, 6-4, 6-3 స్కోరుతో మారిన్ సిలిక్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మొదటి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ, చివరి మూడు సెట్లలో అతను విజయభేరి మోగించడం విశేషం. అతను స్కోరును సమం చేయగా, చివరి రివర్స్ సింగిల్స్‌లో ఫెడెరికో డెల్‌బొనిస్ 6-3, 6-4, 6-2 ఆధిక్యంతో వరుస సెట్లలో ఇవో కార్లోవిచ్‌పై విజయం సాధించి, అర్జెంటీనాకు డేవిడ్ కప్‌ను అందించాడు.