క్రీడాభూమి

మకావూలో నాలుగో టైటిల్‌పై సింధు కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ, నవంబర్ 28: గత వారం చైనా ఓపెన్‌లో టైటిల్‌ను సాధించి, ఆతర్వాత హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌పై కనే్నసింది. గత మూడేళ్లలో వరుసగా మూడు టైటిళ్లను సాధించి, హ్యాట్రిక్ సృష్టించిన ఆమె నాలుగోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. బుధవారం ఆమె తన తొలి రౌండ్ మ్యాచ్‌ని చైనాకు చెందిన యూ హాన్‌తో ఆడుతుంది. కాగా, మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత క్రమంగా కోలుకుంటున్న సైనా నెహ్వాల్ గట్టిపోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. శస్తచ్రికిత్స అనంతరం ఆమె మొదటి టోర్నీని చైనాలో ఆడింది. అక్కడ తొలి రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. అయితే, హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరి, పూర్వ వైభవాన్ని సంపాదించే దిశగా అడుగులు వేసింది. మకావూలో ఆమె టైటిల్ వేట కొనసాగించనుంది. తొలి రౌండ్‌లో ఆమె ఇండోనేషియాకు చెందిన హన్నా రమాదినీతో తలపడుతుంది. కాగా, పురుషుల విభాగంలో హాంకాంగ్ రన్నరప్ సమీర్ వర్మ, కామన్‌వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ టైటిల్ కోసం పోటీపడతారు.