క్రీడాభూమి

అక్మల్ నిషేధంపై నిర్ణయం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 13: ఒక మ్యాచ్ నుంచి ఉమర్ అక్మల్‌ను సస్పెండ్ చేసే విషయంపై నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వాయిదా వేసింది. ఇటీవల స్వదేశంలో జరిగిన ఖయిద్ ఎ ఆజమ్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో సుయ్ నార్తన్ గ్యాస్ తరఫున మ్యాచ్ ఆడిన ఉమర్ అక్మల్ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించడంతో ఒక మ్యాచ్ నుంచి సస్పెండయ్యాడు. ఫలితంగా అతను ఈనెల 15వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగే టి-20 మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదన్న వాదన వినిపించింది. ఖయిద్ ఎ ఆజమ్ ట్రోఫీలో పాల్గొన్నప్పుడు అక్మల్ రెండు లోగోలు ఉన్న జెర్సీని వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధనలను అనుసరించి ఒకటి కంటే ఎక్కువ లోగోలు ఉండడానికి వీల్లేదు. ఈ విషయంపై టోర్నీ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందడంతో ఉమర్ అక్మల్‌ను ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేస్తూ పిసిబి తొలుత ఆదేశాలు జారీ చేసింది. అయతే, చీఫ్ కోచ్ వకార్ యూనిస్ తదితరులు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని అతని కేసులో నిర్ణయాన్ని వాయదా వేసింది. దీనితో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఉమర్ అక్మల్ పాల్గొనడానికి ఎలాంటి ఆటంకం ఉండదు.