క్రీడాభూమి

రాస్ టేలర్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, నవంబర్ 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తిని రేకిత్తిస్తున్నది. న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 313 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ అద్భుత సెంచరీతో కదంతొక్కాడు. అతని ప్రతిభతో కివీస్ మెరుగైన స్కోరును నమోదు చేయగలిగింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు ఓవర్లలో ఒక పరుగు చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించగా, పాకిస్తాన్ 216 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ దాదాపు ఆట ముగిసే సమయంలో డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ 90 పరుగులు చేయగా, టేలర్ 134 బంతులు ఎదుర్కొని, 16 ఫోర్లతో అజేయంగా 102 పరుగులు సాధించాడు. అతను సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ప్రకటించాడు. 369 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన పాకిస్తాన్ మూడు ఓవర్లు ఆడింది. సమీ అస్లం (1), అజర్ అలీ (0) క్రీజ్‌లో ఉన్నారు. మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆలౌట్ కాకుండా నిలబడి, ఓటమి నుంచి తప్పించుకుంటుందో లేదో చూడాలి. ఒక్క రోజులో ఇంకా చేయాల్సిన 368 పరుగులను చేయగలిగితే, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు అవుతుంది.