క్రీడాభూమి

నాలుగు రోజుల్లో తేల్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 29: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం మొహాలీలో ముగిసిన మూడో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించి కేవలం నాలుగు రోజులకే ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. స్పిన్నర్లు మరోసారి చక్కగా రాణించి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. ఈ సిరీస్‌లో ఇంతకుముందు రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియాకు ఇది వరుసగా రెండో విజయం. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (3/81), రవీంద్ర జడేజా (2/62), జయంత్ యాదవ్ (2/21) మరోసారి మెరుపులు మెరిపించి ప్రత్యర్థుల పతనాన్ని శాసించారు. వీరి జోరును ప్రతిఘటించలేక రెండో ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే చతికిలబడిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియాకు 103 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడాడు. 53 బంతుల్లో ఒక సిక్సర్, మరో 11 ఫోర్ల సహాయంతో 67 పరుగుల అజేయ స్కోరు సాధించిన పార్థివ్ పటేల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచర్యంలో చివరి బంతిని బౌండరీగా మలచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు సాధించడంతో పాటు మొత్తం 4 (తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో 2) వికెట్లు కైవసం చేసుకుని భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.
అంతకుముందు 4 వికెట్ల నష్టానికి 78 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు అదే స్కోరు వద్ద నైట్ వాచ్‌మన్ గారెత్ బాటీ (0) వికెట్‌ను కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతను లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా, అతని స్థానంలో వచ్చిన జోస్ బట్లర్ 18 పరుగులు సాధించి జయంత్ యాదవ్ బౌలింగ్‌లో జడేజాకు దొరికిపోయాడు. ఈ తరుణంలో మరో నైట్ వాచ్‌మన్ జో రూట్‌తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హసీబ్ హమీద్ కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఎంతోసేపు ఫలించలేదు. 45 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత రూట్ (78) జడేజా బౌలింగ్‌లో అజింక్యా రహానేకి క్యాచ్ ఇవ్వడంతో మధ్యాహ్న భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 156 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రిస్ ఓక్స్ (30), ఆదిల్ రషీద్ (0)లను మహమ్మద్ షమీ పెవిలియన్‌కు చేర్చగా, జేమ్స్ ఆండర్సన్ (5) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రనౌట్‌గా నిష్క్రమించాడు. అప్పటికి 59 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు 90.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం 104 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ మురళీ విజయ్ (0) క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత జట్టు 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారా స్థిమితంగా ఆడుతూ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ పార్థివ్ పటేల్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. తేనీటి విరామ సమయానికి వీరిద్దరూ అజేయంగా 26 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత జట్టు 1 వికెట్ నష్టపోయి 33 పరుగుల స్కోరు సాధించింది. ఆ తర్వాత దూకుడు పెంచిన పార్థివ్ ఎడాపెడా షాట్లు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో భారత జట్టు 10.3 ఓవర్లకే 50 పరుగులు సాధించింది. ఆ తర్వాత జోరు మరింత పెంచి 39 బంతుల్లో అర్థ శతకాన్ని నమోదు చేసుకున్న పార్థివ్ పటేల్ రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించన తర్వాత పుజారా (25) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (6)తో కలసి ఆడిన పార్థివ్ పటేల్ (67) 21వ ఓవర్‌లో గారెత్ బాటీ వేసిన రెండో బౌంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ దాటించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. దీంతో 20.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి నాలుగో రోజే విజయాన్ని అందుకుంది.

చిత్రం..దుమ్ము రేపిన పార్థివ్ పటేల్
(54 బంతుల్లో 67-నాటౌట్)