క్రీడాభూమి

జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ టోర్నీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపుతో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని క్రీడాశాఖ మంత్రి కె అచ్చెంనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా బాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను స్థానిక డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం మంత్రులు కె.అచ్చెంనాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా అచ్చెంనాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలను ప్రోత్సహించబట్టే గోపీచంద్ బాడ్మింటన్‌లో మెటిగా నిలిచారని, ఆయన వద్ద శిక్షణ పొందిన పివి సింధు రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిందని దానికి ముఖ్యమంత్రి ముందు చూపే కారణమని పేర్కొన్నారు. బాడ్మింటన్‌కు స్థలం కూడా కేటాయిస్తున్నట్లు తెలిపారు. సింధుని ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులు మరింతగా రాణించాలన్నారు. మంత్రి ఉమా మాట్లాడుతూ భారతదేశం నలుమూలల నుండి క్రీడాకారులు అమరావతికి రావడం కొత్తదనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి బాలుర విభాగంలో 280 మంది, బాలికల విభాగంలో 265 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల నిర్వహణకు డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంతో పాటు విజయవాడ క్లబ్, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇండోర్ స్టేడియాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సింగిల్స్, డబుల్స్ విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. డిపిఎస్ వరల్డ్‌స్కూల్ ఈటోర్నీకి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులను మంత్రులు పరిచయం చేసుకుని రాకెట్ చేత పట్టి పోటీలను ప్రారంభించారు. అనంతరం బాడ్మింటన్ స్టార్ పివి సింధు, కోచ్ గోపిచంద్‌లు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్, డిపిఎస్ వరల్డ్ స్కూల్ వైస్ చైర్మన్ కుమారస్వామి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి రఘుకిరణ్, జిల్లా బాడ్మింటన్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ రామమోహన్, డా ఇ త్రిమూర్తి, నాగమణి, రేవతి, శ్రీనివాస్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆంధ్రప్రదేశ్ షటిల్ బాడ్మింటన్ జట్టుతో జాతీయ కోచ్ గోపీచంద్