క్రీడాభూమి

కోహ్లీని గుర్తు చేస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 1: పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ పాక్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ, 22 ఏళ్ల ఆజమ్ ఆ వయసులో కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడన్నాడు. పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ ఆజమ్ ఇప్పటిదాకా మూడు టెస్టులు ఆడగా, గత వారం హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేసే సదవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. ఆ పాక్ ఓటమి పాలయిన ఆ టెస్టులో ఆజమ్ రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. కాగా, ఇప్పటివరకు ఆడిన 18 వన్‌డేలలో ఆజమ్ మూడు సెంచరీలు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లో వరసగా మూడు మ్యాచ్‌లలో ఆ సెంచరీలు చేయడం గమనార్హం. ఆజమ్ యువ క్రికెటర్ అని, రాబోయే రోజుల్లో అతను అద్భుతమైన బ్యాట్స్‌మన్ కాగలడని ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆడనున్న ఏకైక వామప్ మ్యాచ్‌కి ముందు పెర్త్‌కు చెందిన ‘6పిఆర్ రేడియో’లో మాట్లాడుతూ ఆర్థర్ చెప్పాడు. ఇదే వయసులో విరాట్ కోహ్లీ కూడా ఇదే మాదిరిగా ఉండే వాడని చెప్పడానికి సైతం తాను వెనకాడబోనని ఆర్థర్ చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన రెండు టెస్టుల్లోను పరాజయం పాలయిన పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కోసం జట్టులో ఎలాంటి మార్పులనూ చేయకుండా అదే 16 మంది ఆటగాళ్లనే ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ నెల 15నుంచి బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడనుంది. అంతకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో వచ్చే వారం మూడు రోజుల పింక్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టుల తర్వాత పాక్ అయిదు వన్‌డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది.

చిత్రం..బాబర్ ఆజమ్