క్రీడాభూమి

స్క్వాష్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 1: పారిస్‌లో జరుగుతున్న మహిళల స్క్వాష్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభాన్ని సాధించింది. ఈ టోర్నీలో 9 నుంచి 12వ స్థానం కోసం ఆడుతున్న భారత జట్టు గురువారం ఇక్కడ జరిగిన ఓపెనింగ్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో 3-0 తేడాతో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. నెంబర్ 2 క్రీడాకారిణి దీపికా పల్లికల్ వరుస గేముల్లో 11-5, 11-7, 11-5 తేడాతో తెస్సా తెర్ స్లుయిస్‌ను సునాయాసంగా చిత్తుచేసి భారత్‌కు తొలి విజయాన్ని అందించగా, ఆ తర్వాత మిలోయు వాండెర్ హెయిదెన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ జోత్స్న చిన్నప్ప 5-11, 12-10, 11-7, 11-8 తేడాతో విజయం సాధించింది. ఇక చివర్లో సునయన కురువిల్ల 11-8, 11-5, 11-4 గేముల తేడాతో మిల్జా డొరెన్బోస్‌ను చిత్తు చేయడంతో 3-0 తేడాతో విజయం సాధించిన భారత జట్టు తదుపరి రౌండ్‌లో జపాన్ లేదా, కెనడా జట్టుతో తలపడుతుంది.

చిత్రం..దీపికా పల్లికల్