క్రీడాభూమి

క్వార్టర్స్‌కు సైనా, ప్రణీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ, డిసెంబర్ 1: మకావూ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు యువ ఆటగాడు బి.సాయ ప్రణీత్ మరో అడుగు ముందుకేశారు. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ పోరులో విజయం కోసం మరోసారి చెమటోడ్చిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ సైనా స్వల్ప తేడాతో ఇండోనేషియాకు చెందిన దినార్ దియా ఆయుస్టిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దాదాపు గంటసేపు ఆసక్తికరంగా జరిగిన ఈ పోరు ఆరంభంలో సైనా కాస్త వెనుకబడి తొలి గేమ్‌ను 17-21 తేడాతో చేజార్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుని తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో విజృంభించింది. ఫలితంగా 21-18, 21-12 తేడాతో వరుసగా రెండు గేమ్‌లను కైవసం చేసుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి జాంగ్ ఇమన్‌తో తలపడనుంది. కాగా పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువ ఆటగాడు బి.సాయ ప్రణీత్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను హాంకాంగ్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు వాంగ్ వింగ్ కీ వినె్సంట్‌పై సంచలన విజయం సాధించాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో ప్రణీత్ 21-15, 21-17 గేముల తేడాతో కేవలం 43 నిమిషాల్లోనే మట్టికరిపించి అందరినీ ఔరా అనిపించాడు. సెమీస్‌లో స్థానం కోసం ప్రణీత్ చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో తలపడనున్నాడు.
అయితే పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్‌తో పాటు మను అత్రి-బి.సుమిత్ రెడ్డి జోడీ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం భారత శిబిరాన్ని నిరుత్సాహపరిచింది. చైనీస్ తైపీ ఆటగాడు లిన్ యు హియెన్‌తో 45 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో ఘోరంగా వెనుకబడి 13-21 తేడాతో తొలి గేమ్‌ను కోల్పోయిన కశ్యప్ ఆ తర్వాత తీవ్రస్థాయిలో పోరాడాడు. అయినప్పటికీ 20-22 తేడాతో ఆ గేమ్‌ను కూడా చేజార్చుకున్న కశ్యప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరకుండానే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన మను-సుమిత్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరకుండానే నిష్క్రమించారు. గురువారం జరిగిన మూడో రౌండ్ పోరులో వీరు 20-22, 19-21 గేముల తేడాతో సింగపూర్‌కు చెందిన డానీ బవా క్రిస్నాంతా, హెండ్రా విజయ జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు.