క్రీడాభూమి

సైనా నెహ్వాల్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ, డిసెంబర్ 2: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రస్తానానికి తెరపడింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడో టోర్నీలో పాల్గొన్న అమె, గత రెండు టోర్నీలతో పోలిస్తే మకావూలో మెరుగ్గానే ఆడింది. అయితే, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె జాంగ్ ఇమాన్ (చైనా) చేతిలో 17-21, 17-21 తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థికి ఆమె గట్టిపోటీనిచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. 19 ఏళ్ల టీనేజ్ సంచలనం జాంగ్ తనకు ప్రత్యర్థి నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా అధిగమించి విజయభేరి మోగించి సెమీ ఫైనల్ చేరింది. ఇక ఫైనల్‌లో స్థానం కోసం ఆమె చెన్ యుఫెయ్‌తో తలపడుతుంది. యుఫెయ్ క్వార్టర్ ఫైనల్‌లో గో జిన్ వెయ్‌ని 21-14, 21-10 ఆధిక్యంతో చిత్తుచేసింది. కాగా, మరో సెమీ ఫైనల్ చెయుంగ్ గన్‌ఇ, చెన్ జియావోజిన్ మధ్య జరుగుతుంది. గన్‌ఇ 21-17, 21-14 స్కోరుతో లియాంగ్ జియావోయూపై గెలుపొందింది. జియావోజిన్ 21-15, 21-16 స్కోరుతో హాన్ యూను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
ప్రణీత్ పరాజయం
పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కూడా ఓటమిపాలై వెనుదిరిగాడు. క్వార్టర్ ఫైనల్సలో జావో జున్ పెంగ్‌తో తలపడిన అతను 19-21, 9-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. మొదటి సెట్‌లో తీవ్రంగా పోటీపడినప్పటికీ దానిని చేజార్చుకోవడంతో అతను రెండో సెట్‌లో ఒత్తిడికి గురయ్యాడు. దానితో ఎలాంటి ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే పోరును ముగించాడు.

చిత్రం..మకావూ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఓడిన సైనా నెహ్వాల్