క్రీడాభూమి

మాక్స్‌వెల్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 3: సహచర ఆటగాడు మాథ్యూ వేడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కూడా సభ్యుడిగా ఉన్న జట్టు మేనేజ్‌మెంట్ జరిమానా విధించింది. మాక్స్‌వెల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షిఫీల్డ్ షీల్డ్ టోర్నీలో తాను, వేడ్ విక్టోరియా తరఫున ఆడుతున్న విషయాన్ని ప్రస్తావించాడు. ఆ టోర్నీలో వేడ్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి, తనను ఏడో స్థానానికి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. షిఫీల్డ్ షీల్డ్ టోర్నీలో లోయల్ మిడిల్ ఆర్డర్‌లో, అది కూడా వేడ్ కంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్లే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆడే అవకాశాన్ని తాను కోల్పోయానని వాపోయాడు. కాగా, మాక్స్‌వెల్ చేసిన ఈ వ్యాఖ్యలను ఆసీస్ జట్టు మేనేజ్‌మెంట్ తీవ్రమైన నేరంగా పరిగణించింది. సహచరుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడని మాక్స్‌వెల్‌పై మండిపడింది. అతనిపై జరిమానా విధించినట్టు ప్రకటించిందిగానీ, ఎంత మొత్తం అనే విషయాన్ని గోప్యంగా ఉంచింది.
ఎంపికకు అర్హుడే: జరిమానాకు గురైనప్పటికీ, న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో తుది జట్టు ఎంపికకు మాక్స్‌వెల్ అర్హుడేనని ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కివీస్‌తో ఈ జట్టు మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడుతుంది. రెండో మ్యాచ్ 6న కాన్‌బెరాలో, చివరిదైన మూడో వనే్డ 9న మెల్బోర్న్‌లో జరుగుతాయి.