క్రీడాభూమి

ఫిఫా ముడుపుల కేసులో మరో అధికారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాటెమాల సిటీ, జనవరి 13: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)లో ముడుపుల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. తాజాగా మరో అధికారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. గ్వాటెమాల ఫుట్‌బాల్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రయాన్ జిమెనెజ్‌ను పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా నిఘా విభాగం సూచన మేరకే ఈ అరెస్టు జరిగిందని అధికారులు ప్రకటించారు. 61 ఏళ్ల జిమెనెజ్ కూడా లంచాలు తీసుకున్న అధికారుల జాబితాలో ఉన్నట్టు తెలిపారు. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ నిర్వాహణ హక్కులను రష్యా, కతార్ దేశాలకు కట్టబెట్టడానికి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే 16 మందిని స్విట్జర్లాండ్, హోండురాస్ దేశాల్లో అరెస్టు చేశారు. తాజాగా గ్వాటెమాల సాకర్ మాజీ చీఫ్ కూడా ఆ జాబితాలో చేరాడు. వరల్డ్ నిర్వాహణ హక్కుల కోసం పోటీపడిన అమెరికా కూడా లాబీయింగ్ కోసం భారీగా ఖర్చు చేసింది. అయితే, హక్కులను సంపాదించలేకపోవడంతో ఈ వ్యవహారంపై విచారణ ఆరంభించింది. నిఘా విభాగాన్ని ప్రభుత్వం రంగంలోకి దిగడంతో పలు కొత్తకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు నేపథ్యంలోనే ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వచ్చేనెల జరిగే ఫిఫా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న యూఫా అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపైనా ఆరోపణలు వెలుగుచూశాయి. వీరిద్దరిపైనా ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించనున్నట్టు వారు ప్రకటించారు. కాగా, గ్వాటెమాల ఫుట్‌బాల్ మాజీ చీఫ్ అరెస్టుతో ముడుపుల కేసులో చాలా దేశాలకు చెందిన అధికారుల పాత్ర ఉందన్న వాస్తవం మరోసారి బహిర్గతమైంది.