క్రీడాభూమి

విమాన ప్రమాదంలో మృతి చెందిన సాకర్ క్రీడాకారులకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాపెకో (బ్రెజిల్): కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో మృతి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభిమానులు తుది వీడ్కోలు పలికారు. బ్రెజిల్ యావత్తు ఈ దుర్ఘటనపై కార్చిన కన్నీరు భారీ వర్షం రూపంలో కురుస్తున్నా లెక్క చేయని వందలాది మంది అభిమానులు సాకర్ ఆటగాళ్ల మృతదేహాలపై పుష్పగుచ్ఛాలను ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ విమాన సంఘటనలో మొత్తం 71 మంది మరణించిన విషయం తెలిసిందే. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్లు పీలే, నేమార్ ప్రత్యేక సందేశాల్లో మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బ్రెజిలియన్ సాకర్ క్లబ్ చపెకొయన్స్ రియల్ జట్టుకు చెందిన క్రీడాకారులు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కొలంబియాలోని బగోటా సమీపంలోని పర్వత్ర శ్రేణుల్లో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మొత్తం 71 మంది మృతి చెందారు. వారిలో చపెకొయన్స్ రియల్ జట్టుకు చెందిన 19 మంది క్రీడాకారులు ఉన్నారు. వీరితోపాటు అదే క్లబ్‌కు చెందిన 17 మంది సిబ్బంది, ఏడుగురు డైరక్టర్లు కూడా మృత్యువాత పడ్డారు. ఒకే క్లబ్‌కు చెందిన మొత్తం 43 మంది మృతి చెందడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుదామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్రీడాకారుల మృత దేహాలను అధికారులు అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళ్లారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వందలాది మంది అభిమానులు రోడ్లపైకి చేరుకున్నారు. మృతులకు నివాళులర్పించారు.

చిత్రం..కొలంబియా విమాన దుర్ఘటనలో మృతి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుల అంతిమ యాత్ర. భారీగా తరలివచ్చిన అభిమానులు