క్రీడాభూమి

విజేతలు పెంగ్, యూఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ, డిసెంబర్ 4: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో జావో జున్ పెంగ్, మహిళల సింగిల్స్‌లో చెన్ యూఫై టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పెంగ్ 21-11, 21-19 ఆధిక్యంతో వరుస సెట్లలో టాప్ సీడ్ చౌ తియెన్ చెన్‌కు షాకిచ్చాడు. మొదటి సెట్‌ను సులభంగానే సొంతం చేసుకున్న పెంగ్‌కు రెండో సెట్‌లో చెన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే, ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా పెంగ్ ఆ సెట్‌ను కూడా గెల్చుకొని టైటిల్ అందుకున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ యూఫై 21-13, 21-18 ఆధిక్యంతో చెన్ జియావోజిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ మొదటి సెట్ దాదాపు ఏకపక్షంగా, రెండో సెట్ కొంత వరకూ ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇలావుంటే, పురుషుల డబుల్స్‌లో యాంగ్ లీ, జయే హుయ్ లీ జోడీ 17-21, 21-18, 21-19 స్కోరుతో జాంగ్ ఇన్‌నాన్, లూ కాయ్ జోడీని ఓడించి టైటిల్ సాధించింది. మహిళల డబుల్స్ ఫైనల్‌లో అంగియా షి అవాండా, మహాదేవి ని కెటుట్ జోడీపై 21-15, 21-13 స్కోరుతో విజయభేరి మోగించిన చెన్ క్వింగ్‌చెన్, జియా ఇఫాన్ జోడీ టైటిల్ అందుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జాంగ్ ఇన్‌నాన్, లి ఇన్‌హుయ్ జోడీకి టైటిల్ దక్కింది. వీరు ఫైనల్ టాంగ్ చున్ మాన్, సే ఇంగ్ సయెట్ జోడీపై 21-19, 21-15 ఆధిక్యంతో నెగ్గారు.