క్రీడాభూమి

స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 4: చాపెల్-హాడ్లీ ట్రోఫీ వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 68 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. స్టీవెన్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి దీటుగా కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిన్ కూడా శతకాన్ని నమోదు చేసినప్పటికీ తన జట్టును ఆదుకోలేకపోయాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 324 పరుగుల భారీ స్కోరు సాధించింది. వనే్డ కెరీర్‌లో తన అత్యధిక స్కోరుతోపాటు, ఏడో శతకాన్ని నమోదు చేసిన కెప్టెన్ స్మిత్ మొత్తం 157 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 164 పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్ 52 పరుగులు చేసి, ఆసీస్ భారీ స్కోరుకు తన వంత సాయం అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, జీషన్ నీషమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 44.2 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 102 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో జీషన్ నీషమ్ (34), కొలిన్ మున్రో (49), చివరిలో మాట్ హెన్రీ (27) మాత్రమే డబుల్ ఫిగర్స్‌కు చేరుకోగలిగారు. దీనితో గుప్టిల్ శతకం వృథాకాగా, న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడింది. ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 324 (స్టీవెన్ స్మిత్ 164, ట్రావిస్ హెడ్ 52, మాథ్యూ వేడ్ 38, మాట్ హెన్రీ 2/74, ట్రెంట్ బౌల్ట్ 2/51, జీషన్ నీషమ్ 2/58).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 44.2 ఓవర్లలో 256 ఆలౌట్ (మార్టిన్ గుప్టిల్ 114, జీషన్ నీషమ్ 34, కొలిన్ మున్రో 49, మాట్ హెన్రీ 27, జొస్ హాజెల్‌వుడ్ 3/49, మిచెల్ మార్ష్ 2/38, పాట్ కమిన్స్ 2/62, ఆడం జంపా 2/66).

చిత్రం..సెంచరీ హీరో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టీవెన్ స్మిత్