క్రీడాభూమి

9వ తేదీకి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీం కోర్టులో కేసు ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించినప్పుడు తుది తీర్పునిచ్చే అవకాశం ఉందని, కనీసం బోర్డుకు మార్గదర్శకాలను విడుదల చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, ఠాకూర్ అనారోగ్య కారణంగా కేసు తొమ్మిదో తేదీకి వాయిదా పడింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత అనేక మలుపులు తిరిగిన కేసు చివరికి బిసిసిఐ ప్రక్షాళనకు సుప్రీం కోర్టు నడుం బిగించే వరకూ చేరింది. భారత క్రికెట్ రంగాన్ని పారదర్శకంగా ఉంచేందుకు వీలుగా సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ పలు సూచనలు చేసింది. వాటిని అమలు చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇది వరకే బోర్డును ఆదేశించింది. అయితే, లోధా ప్రతిపాదనలను సంపూర్ణంగా అమలు చేయడం అసాధ్యమంటూ బోర్డు కోర్టుకు వివిధ సందర్భాల్లో స్పష్టం చేసింది.
తాజాగా నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, గతంలో చేసిన వాదనకే కట్టుబడి ఉంటున్నట్టు ప్రకటించింది. బోర్డు కౌంటర్‌ను విన్న తర్వాత సుప్రీం కోర్టు ధర్మాసనం కేసును వాయిదా వేసింది. సోమవారం తుది తీర్పునిచ్చే అవకాశం ఉందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో కేసు ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. దీనితో ప్రస్తుత కార్యవర్గాన్ని తొలగించి, అడ్‌హాక్ కమిటీని ఏర్పటు చేయాలని లోధా కమిటీ చేసిన సూచనను సుప్రీం కోర్టు ఆమోదిస్తుందా లేక బోర్డుకు మరి కొంత సమయమిస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతునే ఉంది.