క్రీడాభూమి

అన్ని క్రీడల్లోనూ లోధా సిఫార్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, డిసెంబర్ 5: లోధా కమిటీ చేసిన సిఫార్సులను కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలో అన్ని క్రీడలకూ వర్తింప చేయాలని బహిష్కృత బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వానికి సూచించాడు. క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసిందని, వాటిని బిసిసిఐ ఎందుకు వ్యతికేరిస్తున్నదో తనకు అర్థం కావడం లేదని అతను విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను అతను ప్రస్తావిస్తూ, నేరుగా సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీకి విశేష అధికారాలు ఉన్నాయని అన్నాడు. కానీ, అలాంటి కమిటీ చేసిన ఆదేశాలను కూడా బిసిసిఐ పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఐపిఎల్‌లో ప్రస్తుతం తలెత్తిన సంక్షోభానికి 2009లో ఐపిఎల్ పాలక మండలిలోని సభ్యులందరూ సమష్టిగా బాధ్యత వహించాలని అన్నాడు. లలిత్ మోదీని బహిష్కరించి బిసిసిఐ పొరపాటు చేసిందన్నాడు. లలిత్ మోదీపై అప్పట్లోనే ఐపిఎల్ కమిటీ ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదని, టోర్నీకి అతను అనుసరిస్తున్న విధానాలను ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆటగాళ్ల వల్లే క్రికెట్‌కు ప్రాచుర్యం లభించిందేగానీ పాలకుల వల్ల కాదని అన్నాడు. క్రికెట్‌తో సంబంధం లేని వ్యక్తులు క్రికెట్‌పై ఏ విధంగా అధికారం చెలాయిస్తారని ప్రశ్నించాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)పై గతంలో తాను చేసిన ఆరోపణలను అతను పునరుద్ఘాటించాడు. ఈ ఆరోపణలు చేసిన కారణంగానే అతను అధికార పార్టీ ఆగ్రహానికి గురయ్యాడు. బిజెపి అతనిని పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే, డిడిసిఎ విషయంలో తాను వెనక్కు తగ్గేది లేదని, అవినీతి, అక్రమాలు జరిగాయనడంలో అనుమానం లేదని అన్నాడు. లోధా కమిటీ సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేస్తే, దేశంలో క్రికెట్ పాలనా వ్యవహారాలు మెరుగుపడతాయని ఆజాద్ అభిప్రాయపడ్డాడు. భారత క్రీడా రంగాన్ని గాడిలో పెట్టడానికి, పారదర్శకతను సాధించడానికి లోధా సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి సూచించాడు.

చిత్రం.. కీర్తీ ఆజాద్