క్రీడాభూమి

పెద్దనోట్ల రద్దు ప్రభావం ఐపిటిఎల్ టోర్నీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దు ప్రభావం క్రీడా రంగంపైనా పడింది. దీని కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని, అందుకే ఈసారి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ వంటి స్టార్లు పాల్గొనడం లేదని టోర్నీ వ్యవస్థాపకుడు మహేష్ భూపతి తెలిపాడు. దేశంలో ఆర్థిక పరిస్థితి టోర్నీకి అనుకూలంగా లేదని వ్యాఖ్యానించాడు. దీనితో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగే హైదరాబాద్ లెగ్‌లో ఫెదరర్, సెరెనా హాజరుకావడం లేదని సింగపూర్ నుంచి పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. అదే విధంగా ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్ కూడా ఈసారి ఐపిటిఎల్‌లో ఆడడం లేదని అన్నాడు. ‘బిగ్ ఫోర్’గా పిలిచే ఈ నలుగురు స్టార్లు లేకపోయినప్పటికీ, టోర్నీ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు. ఇలావుంటే భారత్ లెగ్‌లో భాగంగా మూడు రోజుల్లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి రెండు రోజుల్లో మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్ 7.30 గంటలకు మొదలవుతాయి. మొదటి రోజైన 9న తొలి మ్యాచ్‌లో జపాన్ వారియర్స్, యుఎఇ రాయల్స్ ఢీ కొంటాయి. రెండో మ్యాచ్ ఇండియన్ ఏసెస్, ఒయుఇ సింగపూర్ స్లామర్స్ మధ్య జరుగుతుంది. అదే విధంగా రెండో రోజైన 10వ తేదీన మొదటి మ్యాచ్‌లో ఒయుఇ సింగపూర్ స్లామర్స్, జపాన్ వారియర్స్ జట్లు పోటీపడతాయి. రెండో మ్యాచ్ ఇండియన్ ఏసెస్, యుఎఇ రాయల్స్ మధ్య జరుగుతుంది. చివరి రోజైన 11వ తేదీన మొదటి మ్యాచ్ ఉదయం 10.30 గంటలకు, రెండో మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో తలపడే జట్లు ఖరారు కావాల్సి ఉంది.

చిత్రం..ఫెదరర్, సెరెనా