క్రీడాభూమి

భారత్‌తో వనే్డ సిరీస్‌కు మోర్గాన్ కెప్టెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్ వనే్డ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లేందుకు మోర్గాన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనితో అతని స్థానంలో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ నాయకత్వం వహించాడు. భారత్‌లో సిరీస్‌కు మోర్గాన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) తిగిరి అతనికే పగ్గాలు అప్పగించింది. మోర్గాన్‌తోపాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హాలెస్ కూడా జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న జో రూట్‌కు మళ్లీ జట్టులో స్థానం లభించింది. కాగా, పేసర్ బెన్ డకెట్, స్టీవెన్ ఫిన్, జేమ్స్ విన్స్ భారత్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌కు బయలుదేరతారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ వరసగా జనవరి 15 (పుణే), 19 (కటక్), 22 (కోల్‌కతా) తేదీల్లో జరుగుతాయి. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను ఇంగ్లాండ్ ఆడుతుంది. ఆ సిరీస్‌కు కూడా మోర్గాన్ నాయకత్వం వహిస్తాడు.
ఇంగ్లాండ్ వనే్డ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జొనథాన్ బెయిర్‌స్టో, జేక్ బాల్, శామ్ బిల్లింగ్స్, జొస్ బట్లర్, లియామ్ డాసన్, అలెక్స్ హాలెస్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్.
ఇంగ్లాండ్ టి-20 జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జేక్ బాల్, శామ్ బిల్లింగ్స్, జొస్ బట్లర్, లియామ్ డాసన్, అలెక్స్ హాలెస్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే.

చిత్రం..ఇయాన్ మోర్గాన్