క్రీడాభూమి

వార్నర్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెరా, డిసెంబర్ 6: న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన రెండో వనే్డను ఆస్ట్రేలియా 116 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకుంది. చివరిదైన మూడో వనే్డ ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్‌కు సిరీస్‌ను అందించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. అతను సెంచరీతో కదంతొక్కి, ఆసీస్ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 378 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వార్నర్ 115 బంతుల్లో 119 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (72), ట్రావిస్ హెడ్ (57), మిచెల్ మార్ష్ (76) అర్ధ శతకాలతో రాణించడంతో ఆస్ట్రేలియాకు భారీ స్కోరు సాధ్యమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి రెండు వికెట్లు లభించాయి.
మొదటి వనే్డలో పరాజయాన్ని ఎదుర్కొన్న కారణంగా, ఈ మ్యాచ్‌ని గెలిచి, సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలంటే 379 పరుగుల భారీ స్కోరు సాధించాల్సిన న్యూజిలాండ్ ఏ దశలోనూ ఆ స్థాయిలో ఆడలేకపోయింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 81, జిమీ నీషమ్ 74 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (45) కూడా జట్టును కాపాడేందుకు కృషి జరిపాడు. కానీ, మిగతా వారి నుంచి సరైన సహకారం లేనందున న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 41 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, జొష్ హాజెల్‌వుడ్, జేమ్స్ ఫాల్క్‌నెర్ తలా రెండేసి వికెట్లు సాధించారు. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వనే్డ మెల్బోర్న్‌లో 9వ తేదీన జరుగుతుంది. అయితే, ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకోవడంతో, చివరి వనే్డకు ప్రాధాన్యం లేకుండాపోయింది.

చిత్రం..అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్