క్రీడాభూమి

ఇంకెన్ని సంచలనాలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జనవరి 13: అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని స్వతంత్ర కమిటీ రెండో నివేదిక గురువారం వెలువడనున్న నేపథ్యంలో ఇంకెన్ని సంచలన అంశాలు బయటపడతాయోనని యావత్ క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. వాడా కమిటీ సమర్పించిన తొలి నివేదిక క్రీడా రంగాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో పతకాలను కొల్లగొట్టేందుకు వీలుగా తమదేశ అథ్లెట్లకు రష్యా ప్రభుత్వమే వ్యూహాత్మకంగా డోపింగ్ అలవాటు చేసిందన్న ఈ కమిటీ తన తొలి నివేదికలో వెల్లడించింది. వ్యూహాత్మక డోపింగ్‌కు అంతర్జాతీయ అమెచూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) అధికారులు సహకరించారని నిగ్గుతేల్చింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా, నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఉపయోగించిన అథ్లెట్లను, ఆయా దేశాలను బ్లాక్‌మెయిల్ చేసి, లక్షలాది డాలర్లు ముడుపులుగా తీసుకున్నాడని ఐఎఎఎఫ్ మాజీ అధ్యక్షుడు లామిన్ డియాక్‌పై ఆరోపణలు చేసింది. అంతేగాక అతని కుమారుడు పపా మసటా డియాక్, వారి న్యాయ సలహాదారు హబీబ్ సిసే పేర్లను కూడా ముడుపుల కేసులో చేర్చింది. తొలి నివేదిక ఆధారంగా, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. రష్యాను తాత్కాలికంగా అంతర్జాతీయ పోటీల నుంచి నిషేధించారు. రష్యా క్రీడా శాఖకు చెందిన పలువురు అధికారులపై వేటు పడింది. మొదటి నివేదిక సంచలనాలు సృష్టించగా, రెండో నివేదికలో ఎలాంటి భయంకరమైన వాస్తవాలు వెల్లడవుతాయోనన్న భయం ప్రస్తుతం క్రీడా ప్రపంచాన్ని వెంటాడుతున్నది.
వెల్లడికానున్న
భయంకర సత్యాలు!
వాడా రెండో నివేదికలో ఎవరూ ఊహించని భయంకరమైన సత్యాలు వెల్లడికానున్నాయా? గతంలో ఎన్నడూ లేని విధంగా డోపింగ్‌గా జరిగిన తీరుతెన్నులు బయటపడతాయా? అవునని అంటున్నాడు వాడా కమిటీ చీఫ్ డిక్ పౌండ్. గతంలో వాడా అధ్యక్షుడిగా వ్యవహరించిన పౌండ్ ఇప్పుడు వాడా ఆధ్వర్యంలోని కమిటీకి నాయకత్వం వహిస్తున్నాడు. రెండో నివేదికలో సంచలన వాస్తవాలు వెల్లడవుతాయని అతను ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ‘ఇలా కూడా జరుగుతుందా?’ అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే ఎన్నో అంశాలు ఉంటాయని పేర్కొన్నాడు. భయంకర సత్యాలను క్రీడా ప్రపంచం తెలుసుకోబోతున్నదని వ్యాఖ్యానించాడు. అతని మాటల్లోని అంతరార్థం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. రష్యా మాదిరిగానే మరికొన్ని దేశాలు కూడా డోపింగ్ ఆరోపణల్లో చిక్కుకుంటాయని, ఆయా దేశాల అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఏ విధంగా వాడారో, వారికి ఎవరెవవరు సహకరించారో స్పష్టమవుతుందని అంటున్నారు. ఎంతో మంది అథ్లెట్లు, అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అవినీతికి పరాకాష్ట అంటే ఏమిటో, లంచాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి రెండో నివేదికలో అంశాని చాలని డిక్ పౌండ్ అంటున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో, చిత్రాతిచిత్రంగా ఏ విధంగా మోసాలు జరుగుతాయో కూడా రెండో నివేదికలో వెల్లడించామని అతను చెప్తున్నాడు. దీనితో ఈ నివేదికపై అంచనాలు పెరుగుతున్నాయి.
నిర్లక్ష్యమే కారణమా?
వాడా కమిటీ మొదటి నివేదికలో వెల్లడించిన పలు అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. రష్యా ప్రభుత్వమే వ్యూహాత్మకంగా డోపింగ్‌ను ప్రోత్సహించిందన్న వార్త సంచలనం సృష్టించగా, అథ్లెటిక్స్ రంగాన్ని ఒకప్పుడు ఏలిన ఎంతో మంది మేటి స్టార్లు కూడా దోషులేనన్న వాస్తవం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. సహజంగా మేజర్ టోర్నీలకు ముందు పోటీదారులందరి రక్తం, మూత్ర నమూనాలను సేకరిస్తారు. ‘ఎ’, ‘బి’ శాంపిల్స్ రూపంలో రెండు దఫాలుగా ఈ సేకరణ జరుగుతుంది. చాలా దేశాల్లో వాడా గుర్తింపు పొందిన స్థానిక డోపింగ్ నిరోధక విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాలు సమర్పించే నివేదికల ఆధారంగానే ఈవెంట్స్ నిర్వాహకులు నిర్ణయాలు తీసుకుంటారు. వాడా నేరుగా పరీక్షలు జరిపే సందర్భాలు తక్కువగా ఉంటాయి. అయితే, వివిధ దేశాల డోపింగ్ నిరోధక విభాగాలు సమర్పిస్తున్న నివేదికల్లో నిజానిజాల గురించి ఐఎఎఎఫ్ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. డోపింగ్ పరీక్షల్లో టోకు మొత్తంగా అందరికీ క్లీన్‌చిట్ ఎలా లభిస్తుందన్న అనుమానం కూడా అధికారులకు రాలేదా అన్న ప్రశ్న వినిపిస్తున్నది. జలుబు, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సాధారణ రుగ్మతలకు వాడే చాలా మందుల్లో నిషిద్ధ ద్రవ్యాలు ఉండడం, ఫలితంగా డోపింగ్ పరీక్షలో వాటిని వాడిన వారు దోషులుగా తేలడం ఆనవాయితీగా వస్తోంది. విచారణ జరిపి, సమాచారాన్ని సేకరించి, కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే అథ్లెట్లకు క్లీన్‌చిట్ ఇవ్వాలా లేక వారిని డోపింగ్ దోషులుగా తేల్చాలా అన్నది నిర్ణయిస్తారు. అయితే, చాలా దేశాల నుంచి డోపింగ్ నిరోధక విభాగాలు పోటీదారులందరికీ క్లీన్‌చిట్ ఇచ్చినప్పుడు ఐఎఎఎఫ్ అధికారులకు అనుమానం ఎందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం లభించాలి. నివారించగల అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు స్పందించలేదన్న అనుమానం వ్యక్తమవుతున్నది. చాలామంది అధికారులకు ముడుపులు దక్కాయని, అందుకే వారు డోపింగ్ కేసులను చూసీచూడనట్టు వదిలేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణల్లో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు. అధికారులు ముడుపులు తీసుకొని కళంకిత అథ్లెట్లను విడిచిపెట్టారన్న వాస్తవాన్ని వాడా కమిటీ తన మొదటి నివేదికలో బయటపెట్టింది. రెండో నివేదికలో ఇంకెన్ని నిజాలు వెల్లడవుతాయో చూడాలి. కపిటీ చీఫ్ డిక్ పౌండ్ పలు సందర్భాల్లో తెలిపిన వివరాల ప్రకారం, రెండో నివేదిక ప్రకటనలను సృష్టిస్తుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)లో వెలుగు చూసిన అక్రమాలను మించిన సంఘటనలకు సంబంధించిన వివరాలు రెండో నివేదికలో ఉంటాయి. మొదటి నివేదిక తర్వాత దిగ్భ్రాంతికి లోనైన క్రీడా ప్రపంచం ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు. ఈలోగా మరోసారి ప్రకంపనలను సృష్టించేందుకు రెండో నివేదిక సిద్ధమైంది. మొత్తం మీద వాడా రెండో నివేదికపైనే అందరూ దృష్టి సాకరిస్తున్నారు. భయంభయంగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి తర్వాత వెలువడే ఈ నివేదికలో ఏఏ అంశాలు చోటు చేసుకుంటాయో? ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో? ఎవరెవరు దోషులుగా తేలుతారో? ఎంతమందిపై వేటు పడుతుందో? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే నివేదిక వివరాలు బహిర్గతమయ్యే వరకూ వేచిచూడక తప్పదు.