క్రీడాభూమి

తొలి విజయం కోసం ఇంగ్లాండ్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: వరుసగా రెండు మ్యాచ్‌లను చేజార్చుకొని, ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడిన ఇంగ్లాండ్ గురువారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో భారత్‌ను ఓడించి, ఆశలు నిలబెట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నది. ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ టెస్టులు ఆడిన క్రికెటర్‌గా ఇప్పటికే చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకున్న కెప్టెన్ అలస్టర్ కుక్ నాలుగేళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చినప్పుడు జట్టును 4-0 తేడాతో గెలిపించాడు. కానీ, ఈసారి అదే స్థాయిలో అతని సేన విధ్వంసాన్ని సృష్టించలేకపోతున్నది. అప్పటి జట్టులో ఉన్న కెవిన్ పీటర్సన్ వంటి మేటి ఆటగాళ్లు ఇప్పుడు లేరు. దీనికితోడు కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడడం కూడా కెప్టెన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. రాజ్‌కోట్ టెస్టును ఉత్కంఠ భరితంగా మార్చినప్పటికీ, చివరి క్షణాల్లో విరాట్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ కారణంగా కుక్ బృందానికి విజయం దక్కలేదు. అయితే, ఆతర్వాత రెండు టెస్టుల్లో భారత్ విజృంభణ ముందు నిలవలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగా, ఇంగ్లాండ్ అందుకు భిన్నంగా ప్రమాణాలను కోల్పోతూ వస్తున్నది. నిలకడలేని బ్యాటింగ్, ముందుగా ఊహించడానికి వీల్లేని రీతిలో మారుతున్న బౌలింగ్ సమీకరణలు ఇరు జట్లను సమానంగానే వేధిస్తున్నాయి. అయితే, టీమిండియా తరఫున ఒక్కో ఇన్నింగ్స్‌లో ఒకరిద్దరు మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఈ బాధ్యతను స్వీకరిస్తున్న వారు కరవయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న కుక్‌కు తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలియనివికావు. అందుకే, ప్రాక్టీస్ సెషన్‌లో అతను ప్రతి అంశంపైనా దృష్టి పెడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగో టెస్టును గెలవడం ద్వారా సిరీస్‌ను డ్రా చేసుకునే ఆశలు నిలబెట్టుకోవాలని చెమటోడుస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇంత వరకూ విజయానందాన్ని ఆస్వాదించని కుక్ బృందం తొలి గెలుపును ఖాతాలో వేసుకోవడానికి నెట్స్‌లో శ్రమిస్తున్నది. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను తనకు అనుకూలంగా మలచుకొని, నాలుగో టెస్టును గెలవాలన్నదే ఇంగ్లాండ్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ ప్రయత్నంలో సఫలమవుతుందో లేదో చూడాలి.
సక్లెయిన్ కాంట్రాక్టు పొడిగింపు
లండన్: బౌలింగ్ సలహాదారుగా పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్‌తో గతంలో కుదిరిన కాంట్రాక్టును పొడిగించినట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ సంఘం (ఇసిబి) ప్రకటించింది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టులో స్పిన్నర్లు మోయిన్ అలీ, అదిల్ రషీద్‌కు సక్లెయిన్ సలహాలిస్తాడని పేర్కొంది. టెస్టు సిరీస్‌లో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల తర్వాత, వనే్డ సిరీస్ సమయంలోనూ అతను తన సేవలను కొనసాగిస్తాడని తెలిపింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వతావరణం నెలకొని ఉన్నప్పటికీ, సక్లెయిన్‌తో కాంట్రాక్టును ఇసిబి పొడిగించడం గమనార్హం. టెస్టు సిరీస్ అనంతరం భారత్‌తో ఇంగ్లాండ్ మూడు వనే్డలు, మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్‌ను ఆడుతుంది.

చిత్రం..వాంఖడే స్టేడియంలో మంగళవారం రొటీన్ వామప్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు