క్రీడాభూమి

పార్థీవ్‌కే కీపింగ్ గ్లోవ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: గాయం నుంచి కోలుకుంటున్న వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు విశ్రాంతినివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. దీనితో, ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి మొదలుకానున్న నాలుగో టెస్టులోనూ పార్థీవ్ పటేల్ కీపింగ్ బాధ్యతలను చేపట్టనున్నాడు. సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ టెస్టు ఆడిన అతను మొహాలీ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 67 చొప్పున పరుగులు సాధించాడు. కీపర్‌గానూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీనితో సాహాకు నాలుగో టెస్టు నుంచి కూడా విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో పార్థీవ్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్టు బిసిసిఐ ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కే ప్రకటించాడు. విశాఖపట్నంలో జరిగిన టెస్టులో కండరాలు బెణకడంతో సాహా వైద్య సేవలు పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, మొదటి మూడు టెస్టుల్లో ఆడిన ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వివాహం ఈనెల 9న బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమ సింగ్‌తో జరగనుంది. అందుకే అతనిని రిలీవ్ చేసినట్టు షిర్కే తెలిపాడు.
విజయ్‌పై విమర్శలు వద్దు: కుంబ్లే
ఓపెనర్ మురళీ విజయ్‌పై విమర్శలు చేయడం తగదని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. మంగళవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ విజయ్ షార్ట్‌పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడని, ఎక్కువ పర్యాయాలు అలాంటి బంతులకే అవుటవుతున్నాడని మీడియాలో వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో శతకాన్ని నమోదు చేసినప్పటికీ, ఆతర్వాత అతను వరుసగా రెండు టెస్టుల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయాడు. ఫాస్ట్ బౌలర్లు సంధిస్తున్న షార్ట్ పిచ్ బంతులను అతను తిప్పికొట్టలేకపోతున్నాడు. విపరీతమైన వేగంతో మీదకు దూసుకొచ్చే బంతులను హుక్ లేదా పుల్ షాట్‌గా మార్చే ప్రయత్నంలో అవుటవుతున్నాడు. మీడియాలో ఇదే అంశంపై విమర్శలు రావడంతో కుంబ్లే వాటిపై స్పందించక తప్పలేదు. విజయ్‌పై అలాంటి వ్యాఖ్యలు సరికావని అన్నాడు. ఎలాంటి బంతులైనా ఆడే సత్తా అతనికి ఉందని చెప్పాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, ఓపెనర్‌గా దిగేందుకు పార్థీవ్ పటేల్ ముందుకొచ్చాడని అన్నాడు. అంతేగాక, తన బాధ్యతను అతను సమర్థంగా పోషిస్తున్నాడని తెలిపాడు.
వామప్ మ్యాచ్‌ల్లో ఆడనున్న ధోనీ!
ఇంగ్లాండ్‌తో వచ్చేనెల 15 నుంచి మొదలయ్యే వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌కు ముందు ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడే అవకాశాలున్నాయి. జనవరి 10, 12 తేదీల్లో ఇంగ్లాండ్‌తో భారత్ ‘ఎ’ రెండు 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లను ముంబయిలోని సిసిఐ మైదానంలో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ధోనీ పాల్గొనే అవకాశం ఉందని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. అయితే, అతను ఆడే విషయం ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. ఈ విషయంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపాయి.

చిత్రం.. పార్థీవ్ పటేల్