క్రీడాభూమి

ముంబయికర్ లేకుండా మొదటి టెస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: భారత క్రికెట్‌లో ముంబయి ఆధిపత్యం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే సమయంలో భారత జట్టులో కనీసం ఇద్దరు ముగ్గురు ముంబయి ఆటగాళ్లు ఉండేవాళ్లు. ఒక్కోసారి ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆరు నుంచి ఏడుగురు ముంబకర్‌లు ఉండేవారంటే, అక్కడి ఆధిపత్యాన్ని ఊహించుకోవచ్చు. అయితే, 83 సంవత్సరాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక్క ముంబయి ఆటగాడు కూడా లేకుండానే టెస్టు మొదలైంది. 1933లో భారత్ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి మొదలుపెడితే, ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆరంభానికి ముందు వరకూ 505 టెస్టులు ఆడింది. ఇన్ని టెస్టుల్లోనూ ప్రతిసారీ తుది జట్టులో ముంబయి నుంచి కనీసం ఒక ఆటగాడు బరిలోకి దిగేవాడు. కానీ, ఈ మ్యాచ్‌లో ఆడుతున్న ప్లేయింగ్ ఎలెవెన్‌లో ముంబయి నుంచి ఎవరూ లేకపోవడం విచిత్రం. మహమ్మద్ షమీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, అతనికి బ్యాకప్‌గా జట్టులోకి శార్దూల్ ఠాకూర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. ఫలితంగా, భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక్క ముంబయి ఆటగాడు కూడా లేకుండా మ్యాచ్ జరుగుతున్నది. దీనికి వేదిక ముంబయే కావడం విచిత్రం.
వాంఖడేలో 25వ టెస్టు: ముంబయి వాంఖడే స్టేడియంలో ఇది 25వ టెస్టు. 1974-75 సిరీస్‌లో భాగంగా మొదటిసారి ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌తో పాతిక టెస్టుల మైలురాయిని వాంఖడే చేరుకుంది. కాగా, ముంబయిలో ఇది 44వ టెస్టు. ఇంతకు ముందు, 1948-1072 మధ్యకాలంలో చర్చిగేట్‌కు సమీపంలోని బ్రబౌర్న్ స్టేడియంలో 18 టెస్టులు జరిగాయి.