క్రీడాభూమి

రికార్డు కాదు మైలురాయి మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 14: సంక్షిప్తంగా అందరూ ‘సాన్‌టినా’గా పిలుస్తున్న సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ వరుస విజయాల్లో ప్రపంచ రికార్డు సృష్టించిందా? వరుసగా 29వ విజయాన్ని నమోదు చేయడంతో గిగీ ఫెర్నాండెజ్ (పోర్టారికో), నటాషా జ్వెరెవా (బెలారస్) జోడీ రికార్డును బద్దలు చేసిందా? నిన్నటి వరకూ అవునంటూ ఊరదగొట్టిన వార్తా సంస్థలు ఇప్పుడు వీరు ఒక మైలురాయిని చేరుకున్నారే తప్ప రికార్డును అధిగమించలేదని స్పష్టం చేస్తున్నాయి. సాన్‌టినా విజయ పరంపరల రికార్డు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులంతా ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలియక తికమకపడుతున్నారు.
సానియా, మార్టినా జోడీ సిడ్నీ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన చెన్ లియాంగ్, షుయ్ పెంగ్ జోడీని ఓడించిన వెంటనే వీరు 28వ వరుస విజయాలను నమోదు చేసి, 1994లో గిగీ ఫెర్నాండెజ్, జ్వెరెవా జోడీ రికార్డును సమం చేశారని వార్తా సంస్థలు ఊదరగొట్టాయి. సెమీ ఫైనల్‌లో వీరు రలుకా ఒలారూ (రుమేనియా), యరొస్లావా ష్వెడోవా (కజకస్థాన్) జోడీపై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది. ‘సాన్‌టినా’ జోడీకి ఇది వరుసగా 29వ విజయం కావడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైందన్న వార్తలు తొలుత వెలువడ్డాయి. అయితే, వరుస విజయాల రికార్డు 29 కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1990లో జానా నొవోత్న, హెలెనా సుకోవా 44 వరుస విజయాలు సాధించారు. ఈ రికార్డును చేరుకోవాలంటే సాన్‌టినా జోడీ ఇంకా 15 వరుస విజయాలను సాధించాలి. సిడ్నీ ఓపెన్ ఫైనల్‌తోపాటు, ఆతర్వాత జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ వీరు విజయభేరి మోగించి టైటిల్ సాధిస్తే, వరుస విజయాల సంఖ్య 36 అవుతాయి. ఆతర్వాత నొవోత్న, సుకోవా రికార్డును చేరడం సాన్‌టినాకు కష్టం కాకపోవచ్చు. మొత్తం మీద వీరి ప్రపంచ రికార్డు అంశంపై చివరి వరకూ సస్పెన్స్ కొనసాగింది.

సానియా మీర్జా, మార్టినా హింగిస్
గెలుపే స్మిత్ లక్ష్యం
మెల్బోర్న్, జనవరి 14: భారత్‌తో శుక్రవారం జరిగే రెండో వనే్డలో విజయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కనే్నశాడు. మొదటి వనే్డలో జార్జి బెయిలీతోపాటు స్మిత్ కూడా శతకాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న అతను రెండో మ్యాచ్‌లోనూ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. వరుసగా రెండు వనే్డలను సాధించడంద్వారా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియాపై ఒత్తిడి పెంచాలన్నది అతని వ్యూహంగా కనిపిస్తున్నది. వివిధ ఫార్మెట్స్‌లో, భారత్‌పై అతను వరుసగా 162 (నాటౌట్), 52 (నాటౌట్), 133, 28, 192, 117, 71, 47, 105, 149 చొప్పున పరుగులు సాధించాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతనిని ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపితే భారత్‌కు అంత లాభం. డేవిడ్ వార్నర్, జార్జి బెయిలీ వంటి మేటి బ్యాట్స్‌మెన్ అండ ఆస్ట్రేలియాకు ఉంది. రెండో వనే్డ నుంచి మిచెల్ మార్ష్‌కు విశ్రాంతినివ్వాలని అధికారులు నిర్ణయించగా, అతని స్థానంలో ఎవరు తుది జట్టులోకి వస్తారన్నది ఆసక్తిని కలిగిస్తున్నది. షాన్ సోదరుడు మిచెల్ మార్ష్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా లేక ఉస్మాన్ ఖాజాకు అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. ఎదురుదాడికి దిగడం ద్వారా విజయభేరి మోగించి, సిరీస్‌లో సమవుజ్జీగా నిలవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఆస్ట్రేలియా సమర్థంగా ఎదుర్కొంటుందా లేదా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టంగా కనిపిస్తున్నది. ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండడంతో శుక్రవారం నాటి పోరు ఆసక్తికరంగా మారనుంది.

వాల్కేపై తొమ్మిదేళ్ల వేటు!
రంగం సిద్ధమని ఫిఫా ప్రకటన
జెనీవా, జనవరి 14: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)లో కీలక అధికారులపై ఒక్కొక్కరిగా వేటుపడుతున్నది. అధ్యక్షుడు సెప్ బ్లాటర్, సీనియర్ ఉపాధ్యక్షుడు, యూఫా చైర్మన్ మైఖేల్ ప్లాటినీ ఇప్పటికే చెరి ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటుండగా, ప్రధాన కార్యదర్శి వాల్కేపై తొమ్మిదేళ్ల వేటు పడనుంది. పలు అవినీతి ఆరోపణలపై వాల్కేను గత ఏడాది సెప్టెంబర్‌లో ఫిఫా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈనెల ఆరో తేదీన సస్పెన్షన్ గడువును పెంచుతూ తీర్మానాన్ని ఆమోదించింది. 2014 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాల్కేపై లక్ష స్విస్ ఫ్రాంక్స్ జరిమానా విధించడమేగాక, తొమ్మిదేళ్ల సస్పెన్షన్‌ను విధించాలని ఫిఫా వాదిస్తున్నది. అతనిపై తొమ్మిదేళ్ల సస్పెన్షన్ వేటు ఖాయమని తాజా ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తయ్యాయని, శిక్షను ఖరారు చేయడమే మిగిలిందని పేర్కొంది. వాల్కే స్థానంలో ప్రధాన కార్యదర్శిగా మార్కస్ కాట్నర్ బాధ్యతలు స్వీకరిస్తాడని తెలిపింది. వాల్కేపై చర్య ఖరారైన త ర్వాత కాట్నర్ పదవీ కాలంపై తుది నిర్ణయం ఉంటుందని వివరించింది.

యువ క్రికెటర్లకు

‘ముస్తాక్’ పరీక్ష!

ముంబయి, జనవరి 14: ఎంతో మంది యువ ఆటగాళ్లకు సయ్యద్ ముస్తాక్ అలీ సూపర్ లీగ్ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లు పరీక్ష పెట్టనున్నాయి. ఈ టోర్నీలో రాణించే ఆటగాళ్లు సహజంగానే సెలక్టర్ల దృష్టిలో పడతారు. అందుకే, ప్రిలిమినరీస్‌ను సమర్థంగా పూర్తి చేసి, శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాకౌట్ దశకు చేరిన ఎనిమిది క్వాలిఫయర్ జట్లకు చెందిన పలువురు యువ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. బరోడాకు చెందిన హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్య ఇప్పటికే భారత టి-20 జట్టులో స్థానం సంపాదించాడు. దీనితో అతను ముస్తాక్ అలీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లను ప్రాక్టీస్ ఈవెంట్‌గా ఎంచుకున్నాడు. ప్రిలిమినరీ రౌండ్‌లో ఢిల్లీకి చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సదాన్ బౌలింగ్‌లో 32 పరుగులు కొల్లగొట్టిన హార్దిక్ పాండ్య మొత్తం 51 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో బరోడా ఓడినప్పటికీ, పాయింట్ల ప్రాతిపదికమీద నాకౌట్‌కు చేరింది. కాగా, హార్దిక్ పాండ్య మాదిరిగానే వివిధ జట్లకు చెందిన యువ ఆటగాళ్లు నాకౌట్ మ్యాచ్‌లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇలావుంటే, ముస్తాక్ అలీ టోర్నమెంట్ నాకౌట్ దశ పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ గ్రూప్ ‘బి’ నుంచి తలపడనుంది. గతంలో టోర్నీని గెల్చుకున్న బరోడా గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడుతుంది. చివరి దశ పోటీలు ఈనెల 15న మొదలై, 20న జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి.
గ్రూప్ ‘ఎ’ జట్లు:
విదర్భ, బరోడా, ముంబయి, కేరళ.
గ్రూప్ ‘బి’ జట్లు:
గుజరాత్, ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్.
మ్యాచ్‌ల వివరాలు..
విదర్భ, బరోడా జట్ల మధ్య ‘ఎ’ గ్రూప్‌లో, గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్య ‘బి’ గ్రూప్‌లో జరిగే మ్యాచ్‌లతో ముస్తాక్ అలీ టోర్నీ నాకౌట్ దశ పోటీలు మొదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రూప్ ‘ఎ’లో కేరళ, ముంబయి, అదే విధంగా గ్రూప్ ‘బి’లో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ సంఘం జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. 16న కేరళ/బరోడా, విదర్భ/ముంబయి (గ్రూప్ ‘ఎ’), జార్ఖండ్/్ఢల్లీ, గుజరాత్/ ఉత్తర ప్రదేశ్ క్రికెట్ సంఘం (గ్రూప్ ‘బి’) జట్లు తలపడతాయి. 17 విశ్రాంతి దినంకాగా, 18న గ్రూప్ ‘ఎ’లో విదర్భ/ కేరళ, బరోడా/ముంబయి, గ్రూప్ ‘బి’లో గుజరాత్/జార్ఖండ్, ఢిల్లీ/ఉత్తర ప్రదేశ్ క్రికెట్ సంఘం జట్ల మధ్య మ్యాచ్‌లు ఉంటాయి. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ విజేత జట్ల మధ్య ఫైనల్ ఈనెల 20న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

బౌలింగ్‌పై తొలగని అనుమానాలు

బ్రిస్బేన్, జనవరి 14: బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో శుక్రవారం జరిగే రెండో వనే్డలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఏ విధంగా రాణిస్తుందనేది అనుమానం రేపుతోంది. మొదటి వనే్డలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల సూత్రాన్ని ధోనీ అనుసరించాడు. కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన బరీందర్ శరణ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దారుణంగా విఫలమయ్యారు. దీనితో రెండో వనే్డలో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్న ప్రశ్న ధోనీని వేధిస్తున్నది. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, అతను భారత బౌలర్లలో అత్యధికంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. అశ్విన్ మాదిరిగానే తొమ్మిది ఓవర్లు బౌల్ చేసిన జడేజా 61 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ను కూడా సాధించలేదు. చాలా ఉదారంగా పరుగులు ధారాదత్తం చేసిన వీరిద్దరూ రెండో వనే్డలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారని అభిమానులు ఆశిస్తున్నా, అనుమానాలు కూడా లేకపోలేదు. శరణ్ 9.2 ఓవర్లలో 56 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొదటి వనే్డ ఆడినప్పటికీ అతను రాణించగా, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌లకు వికెట్లు లభించలేదు. భువీ 42, ఉమేష్ 54 చొప్పున పరుగులిచ్చారు. స్థూలంగా చూస్తే, పెర్త్‌లోని వకా స్టేడియంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై శరణ్‌ను మినహాయిస్తే భారత బౌలర్లు ఎవరూ చెప్పుకోదగిన ప్రభావం చూపలేకపోయారు. బ్రిస్బేన్‌లోనూ అదే పరిస్థితి కొనసాగుతుందా లేక బౌలింగ్ గాడిలో పడుతుందా అన్న ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లభించడం లేదు.

హదాదీ హవా
కోపా డెల్ రే క్వార్టర్స్‌కు బార్సిలోనా

బార్సిలోనా, జనవరి 14: కోపా డెల్ రే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మునీర్ ఎల్ హదాదీ రెండు గోల్స్ చేసి, ఎస్పానియల్‌పై బార్సిలోనాకు 2-0 తేడాతో విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచే మెరుపువేగంతో కదులుతూ ఎస్పానియల్ రక్షణ వలయంపై దాడి చేసిన బార్సిలోనా స్ట్రయికర్లు అనుకున్న ఫలితాన్ని సాధించారు. 18వ నిమిషంలోనే హదాదీ తొలి గోల్ చేసి తన జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆతర్వాత కూడా దూకుడును కొనసాగించిన బార్సిలోనాకు 31వ నిమిషంలో హదాదీ మరో గోల్‌ను అందించాడు. 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత, గోల్స్ కోసం ప్రయత్నించకుండా, ఎస్పానియల్ దూకుడును నిలువరించడానికే బార్సిలోనా ఆటగాళ్లు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా మ్యాచ్ ముగిసే వరకూ మరో గోల్ నమోదు కాలేదు. బార్సిలోనా సునాయాసంగా విజయాన్ని నమోదు చేసి, క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

‘మిడిల్’లో వికెట్లు కూల్చాలి

బౌలర్లకు రోహిత్ శర్మ హితవు

బ్రిస్బేన్, జనవరి 14: ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగే రెండో వనే్డలో విజయం సాధించాలంటే, మిడిల్ ఓవర్లలో వికెట్లు సాధించాలని భారత బౌలర్లకు ఓపెనర్ రోహిత్ శర్మ సూచించాడు. గురువారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ మొదటి వనే్డను చేజార్చుకున్నప్పటికీ ఎన్నో సానుకూల అంశాలు కూడా కనిపిస్తాయని అన్నాడు. మూడు వందలకుపైగా పరుగులు సాధించడం శుభ సూచకమన్నాడు. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉందనే విషయం స్పష్టమైందన్నాడు. ఆస్ట్రేలియా 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, స్టీవెన్ స్మిత్, జార్జి బెయిలీ భారీ భాగస్వామ్యం కారణంగా కోలుకుందని అన్నాడు. మిడిల్ ఓవర్లలో రెండుమూడు వికెట్లు పడగొట్టివుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించాడు. ఏ మ్యాచ్‌లోనైనా మిడిల్ ఓవర్లే అత్యంత కీలకమని అన్నాడు. ఆ సమయంలో భారీగా పరుగులు సమర్పించుకుంటే, కోలుకోవడం కష్టమన్నాడు. వికెట్లు సాధించగలిగితే, ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుందన్నాడు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో గమనించామని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని అన్నాడు. ఆస్ట్రేలియా చివరి ఓవర్‌లో గెలిచిందని, దీనిని బట్టి భారత బౌలింగ్ పటిష్టంగానే ఉందనే విషయం స్పష్టమవుతుందని తెలిపాడు. అయితే, కీలక సమయాల్లో వికెట్లు లభించకపోవడమే జట్టును దెబ్బతీసిందన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ బ్రిస్బేన్ వికెట్ కూడా పెర్త్‌ను పోలి ఉంటుందని తొలి వనే్డలో 171 పరుగులతో రాణించిన రోహిత్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టు ఖరారు కాకపోయినప్పటికీ, నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని అన్నాడు. ఇశాంత్ శర్మ ఫిట్నెస్‌తో ఉన్న కారణంగా, రవీంద్ర జడేజా స్థానంలో అతనిని తుది జట్టులోకి తీసుకోవచ్చన్న వాదన వినిపిస్తున్నది. రోహిత్ దీనిని సమర్థించకపోయినప్పటికీ పూర్తిగా తోసిపుచ్చలేదు. వాతావరణం, పిచ్ పరిస్థితి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని తుది జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు.
గులాబీ బంతులతో కష్టమే
డే/నైట్ మ్యాచ్‌ల్లో తెల్ల బంతుల స్థానంలోనే గులాబీ రంగు బంతులను ఆస్ట్రేలియా దేశవాళీ పోటీలతోపాటు, న్యూజిలాండ్‌తో జరిగిన మొట్టమొదటి డే/నైట్ టెస్టు మ్యాచ్‌లోనూ వినియోగించింది. అయితే, గులాబీ బంతుల వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని రోహిత్ వ్యాఖ్యానించాడు. పిచ్ తీరు బాగాలేనప్పుడు బ్యాట్స్‌మెన్ ప్రత్యక్ష నరకాన్ని చూడాల్సి వస్తుందని అన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశాడు. పింక్ బంతులతో మ్యాచ్‌లు ఆడేందుకు తాను వెనుకాడబోనని తేల్చిచెప్పాడు.

ఎదురు దాడి సాధ్యమా?

నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో వనే్డ

బ్రిస్బేన్, జనవరి 14: ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఢీకొననున్న టీమిండియా ఎదురుదాడి చేస్తుందా లేక మొదటి వనే్డలో మాదిరిగానే బౌలింగ్ విభాగంలో విఫలమై పరాజయాన్ని కొనితెచ్చుకుంటుందా అన్నది ఆసక్తిని రేపుతోంది. మంగళవారం పెర్త్‌లో జరిగిన మొదటి వనే్డలో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించారు. రోహిత్ శర్మ అజేయంగా 171 పరుగులు సాధించడంతో, 50 ఓవర్లలో భారత్ మూడు వికెట్లకు 309 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును చేరుకోగలిగింది. అయితే, బౌలర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. చివరి వరకూ తీవ్రంగా కృషి చేసినప్పటికీ, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 149, టి-20 కెప్టెన్ జార్జి బెయిలీ 112 పరుగులు చేసి, తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై కంగారూలు 1-0 ఆధిక్యాన్ని సంపాదించారు.
పేసర్లకు అనుకూలం
బ్రిస్బేన్‌లోని గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని ఇక్కడ జరిగిన ఎన్నో మ్యాచ్‌లు స్పష్టం చేశాయి. కీలక బౌలర్ మహమ్మద్ షమీ గాయపడడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ బంతిని స్వింగ్ చేయగల సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఇటీవల కాలంలో అతని బౌలింగ్‌లో పస తగ్గినట్టు కనిపిస్తున్నది. కెరీర్‌ను ఆరంభించినప్పుడు ఎంత దూకుడుగా ఉండేవాడో, ఎలాంటి బంతులు వేసేవాడో మరచిపోయాడన్న విమర్శలున్నాయి. మరో పేసర్ ఉమేష్ యాదవ్ కూడా భువీతో పోటీపడుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు, ముఖ్యంగా స్మిత్, బెయిలీ జోడీకి కళ్లెం వేయడంలో విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో, మొదటి మ్యాచ్‌లో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేసిన బరీందర్ శరణ్‌పైనే భారం వేసి టీమిండియా ముందుకు సాగనుంది. శరణ్ కొత్త బౌలర్ కాబట్టి అతని బంతులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలిగిందని, రెండో మ్యాచ్‌లో అలాంటి సమస్యలు ఉండవని ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్ ధీమాతో ఉంది. ఇలావుంటే, రెండో వనే్డలోనూ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు అనే సూత్రానే్న ధోనీ పాటిస్తాడా లేక వ్యూహంలో మార్పు చేస్తాడా అన్నది చూడాలి. సహజంగా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవడానికి సిద్ధపడని ధోనీ మరోసారి అలాంటి పంతాలకే పోతాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. సీమర్ ఆల్‌రౌండర్‌కు జట్టులో స్థానం ఉండదని తొలి వనే్డకు ముందు ప్రకటించిన ధోనీ తాను చెప్పినట్టుగానే రిషీ ధావన్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. వ్యూహాన్ని మార్చుకుంటే, తాను అంతకు ముందు తీసుకున్న నిర్ణయం తప్పనే అభిప్రాయం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త తీసుకోవడం ధోనీకి అలవాటుగా మారింది. ఇదే పంతంతో అతను రిషీ ధావన్‌కు అవకాశం ఇవ్వకుండా, మొదటి వనే్డకు ఎంపిక చేసిన బౌలింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవుకాబట్టి, బౌలర్లే వైఫల్యాల బాట నుంచి బయటపడాలి. నిలకడలేమి అన్నదే ఇప్పటి వరకూ టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎదుర్కొంటున్న సమస్య. ఇది బౌలర్లకు కూడా వ్యాపించిందని పెర్త్ వనే్డ నిరూపించింది. ఈ సమస్య నుంచి టీమిండియా ఏ విధంగా బయటపడుతుందనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఏ కోణం లో చూసినా ఇరు జట్ల బలాబలాలు స మానంగానే కనిపిస్తున్నప్పటికీ, స్వదేశం లో మ్యాచ్‌లు ఆడడం కంగారూలకు కలి సొచ్చే అంశం. పైగా పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో, వా నికి పెద్దగా ఇబ్బంది పడాల్నిన అవసరం ఉండదు. ఆ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడా నికి భారత ఆటగాళ్లు చాలా కష్టపడాల్సి వ స్తుందనేది వాస్తవం.