క్రీడాభూమి

జెన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ తరఫున 19 మంది తమతమ కెరీర్ మొదటి టెస్టులోనే శతకాలను నమోదు చేయగా, వారిలో ఓపెనర్లు ఎనిమిది మంది. ఎడమచేతి వాటం ఆటగాడైన జెన్నింగ్స్ గత 50 సంవత్సరాల కాలంలో, తమ మొదటి టెస్టులో సెంచరీ చేసిన మూడో ఓపెనర్ కావడం విశేషం. ఇతని కంటే ముందు ఆండ్రూ స్ట్రాస్, అలస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. జెన్నింగ్స్ కంటే ముందు, 2009లో జొనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాపై ది ఓవల్ మైదానంలో సెంచరీ చేశాడు. అది కెరీర్‌లో ట్రాట్‌కు తొలి టెస్టు.
**
భారత్‌పై జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ప్రారంభంచిన ఒక విదేశీ క్రికెటర్ ఇంతకు ముందు చేసిన అత్యధిక స్కోరు 107 పరుగులు. బెంగళూరులో 1975లో జరిగిన టెస్టులో వెస్టిండీస్ ఓపెనర్ గార్డెన్ గ్రీనిడ్జి ఈ స్కోరు సాధించగా జెన్నింగ్స్ ఆ రికార్డును అధిగమించాడు. కాగా, భారత్‌తోనే టెస్టు కెరీర్‌ను మొదలుపెట్టి, తొలి మ్యాచ్‌లోనే సెంచరీలు సాధించిన అలస్టర్ కుక్ (104 నాటౌట్), అల్విరో పెటెర్సన్ (100) సరసన జెన్నింగ్స్ కూడా చేరాడు. మొత్తం మీద క్రికెట్ చరిత్రలో ఈ విధంగా తొలి టెస్టులో సెంచరీ సాధించిన 103వ బ్యాట్స్‌మన్ అతను. హసీబ్ హబీబ్ టెస్టు కెరీర్‌ను ఆకట్టుకునే విధంగా మొదలు పెడితే జెన్నింగ్స్ సెంచరీతో అదరగొట్టాడు.
**
ముంబయి, డిసెంబర్ 8: ఇంగ్లాండ్ ఓపెన కీటన్ జెన్నింగ్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. భారత్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో అతను ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఇంతకు ముందు జరిగిన మూడు టెస్టుల్లో కెప్టెన్ అలస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీనేజ్ సంచలనం హసీబ్ హమీద్ చేతి వేలి గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీనితో జెన్నింగ్స్‌కు కెరీర్‌లో మొదటి టెస్టు ఆడే అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకున్న అతను సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టులోనే శతకాన్ని నమోదు చేసిన 19వ ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు చక్కటి ఆరంభాన్ని ఇచ్చేందుకు కెప్టెన్ కుక్, జెన్నింగ్స్ శ్రమించారు. ఇద్దరూ 25.3 ఓవర్లలో మొదటి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బంతిని షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించి విఫలమైన కుక్‌ను వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ స్టంప్ చేయడంతో ఇంగ్లాండ్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. మరో 37 పరుగులకు జో రూట్ కూడా పెవిలియన్ చేరాడు. 41 బంతుల్లో 21 పరుగులు చేసిన అతనిని విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా అశ్విన్ అవుట్ చేశాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మోయిన్ అలీతో కలిసి జెన్నింగ్స్ స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. 104 బంతులు ఎదుర్కొని, 50 పరుగులు సాధించిన మోయిన్ అలీని కరుణ్ నాయర్ క్యాచ్ పట్టగా అశ్విన్ అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో జెన్నింగ్స్ కూడా పెవిలియన్ చేరాడు. చటేశ్వర్ పుజారాకు చిక్కిన అతను తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 219 బంతులు ఎదుర్కొన్నాడు. 13 ఫోర్లతో 112 పరుగులు సాధించాడు. అతను అవుటైన తర్వాత ఇంగ్లాండ్ వేగం మందగించింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో 20 బంతుల్లో 14 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అనంతరం బెన్ స్టోక్స్ (25), జొస్ బట్లర్ (18) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్కోరును 5 వికెట్లకు 288 పరుగులకు చేర్చారు. భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.
మాజీ కోచ్ కుమారుడు..
దుబాయ్‌లో ఇంగ్లాండ్ లయన్స్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్న 24 ఏళ్ల జెన్నింగ్స్‌కు ఇది కెరీర్‌లో మొదటి టెస్టు అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయడం విశేషం. అతను దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రే జెన్నింగ్స్ కుమారుడు. అందుకే అతను తనకు బ్యాటింగ్ కొత్తకాదన్న రీతిలో, ఒత్తిడికి గురికాకుండా ఆడి అభిమానులను ఆకట్టుకున్నాడు. 2011లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జెన్నింగ్స్‌కు ఈ ఏడాదిని గోల్డెన్ ఇయర్‌గా పేర్కోవచ్చు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో అతను ఈ ఒక్క ఏడాదే 64.5 సగటుతో 1,548 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో ఏడు శతకాలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.
**
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ స్టెంప్డ్ పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 46, కీటన్ జెన్నింగ్స్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 112, జో రూట్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 21, మోయిన్ అలీ సి కరుణ్ నాయర్ బి అశ్విన్ 50, జానీ బెయిర్‌స్టో సి ఉమేష్ యాదవ్ బి అశ్విన్ 14, బెన్ స్టోక్స్ 25 నాటౌట్, జొస్ బట్లర్ 18 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (94 ఓవర్లలో 5 వికెట్లకు) 288.
వికెట్ల పతనం: 1-99, 2-136, 3-230, 4-230, 5-249.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 11-0-38-0, ఉమేష్ యాదవ్ 10-2-36-0, అశ్విన్ 30-3-75-4, జయంత్ యాదవ్ 22-3-78-0, రవీంద్ర జడేజా 21-3-60-1.