క్రీడాభూమి

మరో విజయంపై భారత్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 9: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో విజయంపై భారత్ కనే్నసింది. మొదటి మ్యాచ్‌ని కెనడాపై 4-0 తేడాతో గెల్చుకొని ఊపుమీద ఉన్న భారత్ శనివారం ఇంగ్లాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. 2011 తర్వాత జూనియర్ హాకీ ప్రపంచ కప్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. అయితే, ఈసారి ఫేవరిట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన హర్జీత్ సింగ్ నాయకత్వంలోని ఈ జట్టు మొదటి మ్యాచ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచింది. కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో రెండో మ్యాచ్‌కి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ఏడాది ఆసియా కప్‌ను నిలబెట్టుకోవడంతోపాటు, నాలుగు దేశాల టోర్నీ ఫైనల్‌లో పటిష్టమైన జర్మనీని ఓడించి టైటిల్‌ను గెల్చుకుంది. ప్రపంచ కప్‌ను కూడా సాధిస్తే, భారత హాకీ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తాయి. గతంలో జూనియర్ ప్రపంచకప్ ఆడిన ఎంతో మంది క్రీడాకారులు ఆతర్వాత సీనియర్స్ జట్టులో స్థానం సంపాదించారు. అదే విధంగా ఇప్పటి జట్టులోని హర్మన్‌ప్రీత్ సింగ్, పర్వీందర్ సింగ్, మన్దీప్ సింగ్, వరుణ్ కుమార్ రానున్న రోజుల్లో సీనియర్స్ సరసన మ్యాచ్‌లు ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా, దక్షిణాఫ్రికాను 4-2 తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ నుంచి శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారత్‌కు గట్టిపోటీ తప్పకపోవచ్చు.