క్రీడాభూమి

ఆసీస్ దెబ్బకు పాక్ విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, డిసెంబర్ 16: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి (డే/నైట్) టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక, ఆట ముగిసే సమయానికి 97 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు ఆటలోనే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవెన్ స్మిత్ సెంచరీతో రాణించగా, రెండో రోజు పీటర్ హ్యాండ్స్‌కోమ్ శతకాన్ని నమోదు చేశాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోరును సాధించింది. మూడు వికెట్లకు 288 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 323 పరుగుల వద్ద స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. అతను 222 బంతులు ఎదుర్కొని, 19 ఫోర్ల సాయంతో 130 పరుగులు చేసి వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కు దొరికిపోయాడు. నిక్ మాడిసన్ (1), మాథ్యూ వేడ్ (7), మిచెల్ స్టార్క్ (10), జొస్ హాజెల్‌వుడ్ (8) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 240 బంతులు ఎదుర్కొన్న హ్యాండ్స్‌కోమ్ 105 పరుగులు చేసి, వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాథన్ లియాన్ 29 పరుగుల వద్ద యాసిర్ షా బౌలింగ్‌లో అసద్ షఫీక్ క్యాచ్ పట్టగా అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 130.1 ఓవర్లలో 429 పరుగుల భారీ స్కోరువద్ద ముగిసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 97 పరుగులకు నాలుగు, వాహబ్ రియాజ్ 89 పరుగులకు నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. యాసిర్ షాకు రెండు వికెట్లు లభించాయి.
అజల్ అలీతో మొదలు..
ఆస్ట్రేలియా పరుగుల వరదకు అతి కష్టం మీద అడ్డుకట్ట వేసిన పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించి, ఆరు పరుగులకే మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన యాసిర్ షా వికెట్‌ను ఉస్మాన్ ఖాజా క్యాచ్ పట్టగా మిచెల్ స్టార్క్ అవుట్ చేయడంతో ప్రారంభమైన పాక్ వికెట్ల పతనం ఆతర్వాత కూడా కొనసాగింది. జట్టును ఆదుకుంటాడనుకున్న ఓపెనర్ సమీ అస్లం కొంత సేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ పరుగులు రాబట్టలేకపోయాడు. మరోవైపు బాబర్ ఆజమ్ (19), యూనిస్ ఖాన్ (0), కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (4), అసద్ షఫీఖ్ (2) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అస్లం 100 బంతులు ఎదుర్కొని, 22 పరుగులు చేసిన తర్వాత జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. వికెట్‌కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వాహబ్ రియాజ్ (1), యాసిర్ షా (1) దారుణంగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేయగలిగింది. అప్పటికి సర్ఫ్‌రాజ్ 31, మహమ్మద్ ఆమీర్ 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జొస్ హాజెల్‌వుడ్ చెరి మూడు వికెట్లు కూల్చారు. జాక్సర్ బర్డ్ ఏడు పరుగులకే రెండు వికెట్లు పడగొట్టడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 429 ఆలౌట్ (మాథ్యూ రెన్‌షా 71, స్టీవెన్ స్మిత్ 130, పీటర్ హాండ్స్‌కోమ్ 105, మహమ్మద్ అమీర్ 4/97, వాహబ్ రియాజ్ 4/89, యాసిర్ షా 2/129).
పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్: 43 ఓవర్లలో 8 వికెట్లకు 97 (సమీ అస్లం 22, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 31 నాటౌట్, మిచెల్ స్టార్క్ 3/45, జొస్ హాజెల్‌వుడ్ 3/19, జాక్సన్ బర్డ్ (2/7).