క్రీడాభూమి

ఇంగ్లాండ్‌ను ఆదుకున్నమోయిన్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో ఒకే టెస్టు సిరీస్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ శతకాలు సాధించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో వాడిగా మోయిన్ అలీ చేరాడు. ఇంతకు ముందు అలస్టర్ కుక్, కెన్ బారింగ్టన్, కొలిన్ కౌడ్రే, మైక్ గాటింగ్, ఆండ్రూ స్ట్రాస్ ఈ ఘనతను అందుకున్నారు. తాజా సిరీస్‌లో రెండో సెంచరీ చేసిన మోయిన్ అలీ వారి సరసన చోటు సంపాదించుకున్నాడు. కాగా, టెస్టుల్లో అతను 1,000 పరుగులను పూర్తి చేశాడు. ఇశాంత్ శర్మ వేసిన బంతిలో రెండు పరుగులను రాబట్టుకోవడం ద్వారా అతను వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు.

చెన్నై, డిసెంబర్ 16: మోయిన్ అలీ అజేయ శతకంతో రాణించడంతో, భారత్‌తో శుక్రవారం ఇక్కడ మొదలైన చివరి, ఐదో క్రికెట్ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ 284 పరుగులు సాధించగలిగింది. టీనేజ్ సంచలనం కీటన్ జెన్నింగ్స్ కేవలం ఒక పరుగు చేసి ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ క్యాచ్ పట్టగా అవుట్ కావడంతో ఏడు పరుగుల స్కోరువద్ద ఇంగ్లాండ్ మొదటి వికెట్ చేజార్చుకుంది. మరో 14 పరుగుల తర్వాత కెప్టెన్ అలస్టర్ కుక్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 38 బంతులు ఎదుర్కొని, 10 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బఔలింగ్‌లో విరాట్ కోహ్లీకి చిక్కాడు. ఈ దశలో జో రూట్‌తో కలిసిన మోయిన్ అలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాడు. మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించిన తర్వాత 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జో రూట్ అవుటయ్యాడు. 144 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లతో రాణించిన అతను రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. అనంతరం వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోతో కలిసి ఇంగ్లాండ్ స్కోరును మోయిన్ 250 పరుగుల మైలురాయిని దాటించాడు. జట్టు స్కోరు 253 పరుగుల వద్ద బెయిర్‌స్టో నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 90 బంతులు ఎదుర్కొని, మూడు సిక్సర్లతో 49 పరుగులు సాధించిన అతనిని లోకేష్ రాహుల్ క్యాచ్ పట్టగా రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. ఈ వికెట్ కూలిన తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ జాగ్రత్త ఆడుతూ, మరో వికెట్ కూలకుండా అడ్డుకున్నాడు. ఆట ముగిసే సమయానికి మోయిన్ 120 (222 బంతులు, 12 ఫోర్లు), బెన్ స్టోక్స్ 5 (29 బంతులు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రవీంద్ర జడేజా 73 పరుగులకు మూడు వికెట్లు కూల్చగా, ఇశాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ సి విరాట్ కోహ్లీ బి రవీంద్ర జడేజా 10, కీటన్ జెన్నింగ్స్ సి పార్థీవ్ పటేల్ బి ఇశాంత్ శర్మ 1, జో రూట్ సి పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 88, మోయిన్ అలీ 120 నాటౌట్, జానీ బెయిర్‌స్టో సి లోకేష్ రాహుల్ బి రవీంద్ర జడేజా 49, బెన్ స్టోక్స్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 284.
వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 12-1-44-0, ఇశాంత్ శర్మ 12-6-25-1, రవీంద్ర జడేజా 28-3-73-3, రవిచంద్రన్ అశ్విన్ 24-1-76-0, అమిత్ మిశ్రా 13-1-52-0, కరుణ్ నాయర్ 1-0-4-0.

* భారత్‌పై జో రూట్‌కు ఇది 11వ టెస్టు మ్యాచ్. అతను ప్రతి టెస్టులోనూ ఏదో ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 50కి పైగా పరుగులు సాధించాడు. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతను 88 పరుగులు చేశాడు. ఒక జట్టుపై ఆడిన ప్రతి టెస్టలోనూ ఎక్కువ పర్యాయాలు కనీసం అర్ధ శతకాన్ని చేసిన బ్యాట్స్‌మన్‌గా రూట్ రికార్డును కొనసాగిస్తున్నాడు. ఇంతకు ముందు వెస్టిండీస్‌పై వాల్టర్స్ తొమ్మిది టెస్టుల్లో ఈ ఫీట్‌ను ప్రదర్శించగా, ఆ రికార్డును రూట్ అధిగమించి, మరింత ముందుకు సాగుతున్నాడు.
* భారత్‌లో టీమిండియాపై, ఒక టెస్టు సిరీస్‌లో ఐదు పర్యాయాలు కనీసం అర్ధ శతకాన్ని సాధించిన తొలి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గా రూట్ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఇయాన్ బోథమ్, గ్రాహం గూచ్ నాలుగు హాఫ్ సెంచరీలతో పంచుకుంటున్న రికార్డును రూట్ బద్దలు చేశాడు.
* చాలా తక్కువ కాలంలో, టెస్టు క్రికెట్‌లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన బ్యాట్స్‌మన్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్ పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. అతను టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 10 సంవత్సరాల 290 రోజుల్లో ఈ మైలురాయిని చేరాడు.

చిత్రాలు..మోయిన్ అలీ 120 నాటౌట్
జో రూట్ (88)