క్రీడాభూమి

సెమీస్‌లో ఓడిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 17: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టోర్నమెంట్ మహిళల సెమీ ఫైనల్‌లో భారత క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పివి సింధు ఓటమిపాలైంది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు తన కంటే రెండు ర్యాంకులు మెరుగ్గా ఉన్న సంగ్ జీ హ్యున్ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న తర్వాత చైనా ఓపెన్‌లోనూ విజేతగా నిలిచిన ఆమె సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. చివరి లీగ్ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌ను ఓడించి సెమీస్ చేరింది. రియోలో స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో మారిన్ చేతిలో ఓడిన సింధు ప్రతీకారం తీర్చుకుంది. అదే ఊపులో సెమీస్‌లో హ్యున్‌ను సులభంగానే ఓడిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, చివరి వరకూ పోరాడినప్పటికీ ఆమె ఫైనల్ చేరలేకపోయింది. వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూడకుండా పరువు నిలబెట్టుకున్నప్పటికీ, సెమీస్ అడ్డంకిని సమర్థంగా అధిగమించలేకపోయింది. ఇలావుంటే, మహిళల ఫైనల్‌లో హ్యున్ టైటిల్ కోసం టాప్ సీడ్ తాయ్ జూ ఇంగ్‌ను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో ఇంగ్ 21-19, 21-19 స్కోరుతో సన్ యూను ఓడించి ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో తియాన్ హౌవెయ్, విక్టర్ అక్సెల్సెన్ ఫైనల్స్‌లో తలపడతారు. మూడోసీడ్ హౌవెయ్ 21-17, 19-21, 21-13 ఆధిక్యంతో టాప్ సీడ్ జాన్ ఒ జొర్గెనె్సన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మరో సెమీ ఫైనల్‌లో ఐదో సీడ్ విక్టర్ అక్సెల్సెన్ 21-17, 21-19 స్కోరుతో రెండో సీడ్ సన్ వాన్ హోపై గెలిచాడు. సీడింగ్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు ఓడడం గమనార్హం.

చిత్రం..పివి సింధు