క్రీడాభూమి

షఫీక్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, డిసెంబర్ 18: అసద్ షఫీక్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలవగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి, డే/నైట్ టెస్టులో పాకిస్తాన్ హోరాహోరీ పోరాటాన్ని కొనసాగిస్తున్నది. విజయం సాధించాలంటే 490 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ నాలుగో రోజు ఆటలో ఎదురుదాడికి దిగింది. ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 382 పరుగులు చేసింది. షఫీక్ (100), యాసిర్ షా (4) క్రీజ్‌లో ఉన్నారు. గెలవాలంటే ఇంకా 108 పరుగులు సాధించాల్సి ఉండగా, రెండు వికెట్లు మాత్రమే మిగిలాయి. మరో రోజు ఆట మిగిలే ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, పాకిస్తాన్ వికెట్లను కాపాడుకుంటూ లక్ష్యాన్ని చేరుతుందా లేక ఆస్ట్రేలియా చివరి రెండు వికెట్లను పడగొట్టి విజయభేరి మోగిస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చిత్రం..అసద్ షఫీక్
(100 నాటౌట్)