క్రీడాభూమి

వింబుల్డన్ చాంపియన్ క్విటోవాపై ఆగంతకుడి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాగ్, డిసెంబర్ 20 ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండుసార్లు చాంపియన్‌షిప్ సాధించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై గుర్తు తెలియని ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. చెక్ రిపబ్లిక్ తూర్పు ప్రాంతంలోని ప్రొస్తెజోవ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్విటోవా ఫ్లాట్‌లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడు ఈ ఘాతుకానికి తెగబడ్డాడని, ఈ దాడిలో ఆమె ఎడమ చేతికి తీవ్రమైన గాయమవడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారని, ప్రస్తుతం ఆమె ప్రాణానికి ముప్పేమీ లేదని క్విటోవా అధికార ప్రతినిధి కరెల్ తెజ్కల్ మంగళవారం తెలిపారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన దుండగుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. 2011లో తొలిసారి, ఆ తర్వాత 2014లో మరోసారి వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన క్విటోవా (21) పాదానికి ఇటీవల గాయమవడంతో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హోప్‌మన్ కప్ టోర్నీకి దూరమైన ఆమె జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీకి సిద్ధమయ్యేందుకు వచ్చే నెల 8వ తేదీ నుంచి సిడ్నీలో మళ్లీ ఆట ప్రారంభించాలని భావిస్తుండగా ఈ ఘటన జరిగింది.

చిత్రం..పెట్రా క్విటోవా