క్రీడాభూమి

టెస్టుల్లోనూ మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 20: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం చెన్నైలో ముగిసిన చివరి మ్యాచ్‌లో మారోసారి ఆధిపత్యాన్ని చాటుకుని ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన టీమిండియా ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్ల జాబితాలోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లి ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడం ద్వారా 5 పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకున్న భారత జట్టు మొత్తం 120 పాయింట్లతో నెంబర్ వన్ జట్టుగా అవతరించి ఆస్ట్రేలియా (105 పాయింట్లు)ను రెండో స్థానానికి నెట్టివేయగా, అంతకుముందు ఆస్ట్రేలియాతో సిరీస్‌ను డ్రాగా ముగించి టీమిండియాతో పోరాడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పతనమైంది. చెరో 102 పాయింట్లను కలిగివున్న పాకిస్తాన్, దక్షిణాఫ్రికా కంటే ఒక పాయింట్ వెనుకబడిన ఇంగ్లాండ్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 101 పాయింట్లు ఉన్నాయి. అయితే డెసిమల్ పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా కంటే స్వల్ప ముందంజలో ఉన్న పాకిస్తాన్ జట్టు తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. అంటే ఐసిసి నగదు అవార్డులకు వార్షిక కటాఫ్ తేదీ అయిన 2017 ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఈ నాలుగు జట్ల మధ్య 4 పాయింట్ల వ్యత్యాసం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఐసిసి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన టెస్టు జట్టు 10 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతిని అందుకుంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు 5 లక్షల డాలర్లు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు లక్ష డాలర్లు చొప్పున లభిస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ మధ్య ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్, భారత్ ర్యాంకులు ఆ తర్వాత అనూహ్య రీతిలో మారిపోవడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి అక్టోబర్ 11వ తేదీన ఐసిసి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాత మరే జట్టూ అధిగమించలేకపోయింది. ఐసిసి టెస్టు జట్ల ర్యాంకింగ్‌లను ప్రతి టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఖరారు చేస్తుండటమే ఇందుకు కారణం. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య కొనసాగుతున్న మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

చిత్రం..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, విన్నింగ్ ట్రోఫీలతో విరాట్ కోహ్లీ