క్రీడాభూమి

విదేశాల్లోనూ సత్తాచాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 21: భారత క్రికెట్ జట్టు స్వదేశంలో పులిలా విజృంభిస్తుందని, అయితే, విదేశాల్లో పిల్లిలా మారిపోతుందని చాలా సంవత్సరాలుగా ఉన్న ముద్రను చెరిపేయడానికి కృషి చేస్తామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. విదేశాల్లోనూ సత్తా చాటుతామని బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రంమలో పాల్గొన్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ జడేజా ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశాల్లో మాత్రమే టీమిండియా రాణిస్తుందని చెప్పడానికి వీల్లేదని అన్నాడు. ఈ ఏడాది భారత జట్టు ఆడిన 11 టెస్టుల్లో ఎనిమిది విజయాలను సాధించిన విషయాన్ని జడేజా గుర్తుచేశాడు. అంతేగాక, 18 వరుస విజయాలను నమోదు చేసిన టీమిండియా ఎక్కడైనా ఆడగలదని చెప్పాడు.
అశ్విన్, జడేజాలకు
మొదటి రెండు స్థానాలు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. 1974లో ఒకసారి ఇదే విధంగా టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ఇద్దరు భారతీయులు, బిషన్ సింగ్ బేడీ, భగవత్ చంద్రశేఖర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు అశ్విన్, జడేజా ఆ ఘనతను సాధించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో పది వికెట్లు పడగొట్టి, భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు.