క్రీడాభూమి

భారత డేవిస్ కప్ జట్టుకు భూపతి కెప్టెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇటీవల కాలంలో ప్రముఖంగా వినిపించిన వాదనే నిజమైంది. భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఉన్న ఆనంద్ అమృత్‌రాజ్‌పై వేటు పడింది. అతని స్థానంలో మహేష్ భూపతిని నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) ప్రధాన కార్యదర్శి హరణ్మయ్ చటర్జీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు. న్యూజిలండ్‌తో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు పుణేలో జరిగే పోటీల్లో ఆనంద్ చివరిసారి భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అదే అతనికి వీడ్కోలు ఈవెంట్ అవుతుంది. కాగా, ఎఐటిఎ తీసుకున్న నిర్ణయంపై ఆనంద్ సంతృప్తితో ఉన్నాడా అన్న ప్రశ్నపై చటర్జీ స్పందిస్తూ, ఏదైనా ఒక హోదాను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరని వ్యాఖ్యానించాడు. అయితే, సమర్థులకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపాడు. ఆటగాళ్లంతా ఆనంద్‌ను సమర్థించే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించగా, ఊహాజనితమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశాడు. ఆటగాళ్లను కలిసి చర్చిస్తామని అన్నాడు. వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్, మహేష్ భూపతి మధ్య చిలకాలంగా కొనసాగుతున్న మనస్పర్థలను గురించి ప్రస్తావించగా, సమయం వచ్చినప్పుడు సమస్యను పరిష్కరిస్తామని చటర్జీ అన్నాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎఐటిఎ సమావేశంలో ఎన్నో అంశాలను చర్చించామని, ఆతర్వాతే తుది నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశాడు.