క్రీడాభూమి

సయ్యద్ మోదీ టోర్నీ నుంచి వైదొలగిన సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 26: పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్న ప్రపంచ రెండో ర్యాంక్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మంగళవారం ఇక్కడ ప్రారంభమైన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి చివరి క్షణాల్లో వైదొలగింది. కాలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ తాను పూర్తిగా కోలుకోలేదని వివరించింది.

ఫిట్నెస్ సమస్య నుంచి కోలుకోని సైనా నెహ్వాల్.

దక్షిణాఫ్రికాను గెలిపించిన రబదా

సెంచూరియన్, జనవరి 27: చివరిలో ఉత్కంఠ రేపిన చివరి, నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా 280 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అయితే, అంతకు ముందే 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఇంగ్లాండ్‌కు సిరీస్ దక్కింది. చివరి టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 475 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా ఇంగ్లాండ్ 342 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 248 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్ ముందు 382 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆటను కొనసాగించి 101 పరుగులకే ఆలౌటైంది. రబదా 10.4 ఓవర్లు బౌల్ చేసి, 32 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. మోర్న్ మోర్కెల్‌కు మూడు వికెట్లు లభించాయి. వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. జేమ్స్ టేలర్ చేసిన 24 పరుగులే టాప్ స్కోర్‌గా నిలవడం ఇంగ్లాండ్ బ్యాటింగ్ వైఫల్యాలకు అద్దం పడుతుంది.

హాకీ ఇండియా లీగ్
రాంచీ విజయం
రాంచీ, జనవరి 27: హాకీ ఇం డియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భా గంగా మంగళవారం జరిగిన లీ గ్ మ్యాచ్‌లో రాంచీ రేస్ జట్టు 2-1 తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ఆష్లే జా క్సన్ రెండు గోల్స్ చేసి రాంచీని గెలిపించాడు. మ్యాచ్ 27వ ని మిషంలోనే రూపీందర్ పాల్ సింగ్ ద్వారా ఢిల్లీకి గోల్ లభిం చింది. కానీ, ఆ ఆధిక్యం ఎక్కు వ సేపు నిలవలేదు. జాక్సన్ 29 వ నిమిషంలో ఈక్వెలైజర్ సా ధించాడు. మరో రెండు నిమి షాల్లోనే మరో గోల్ చేశాడు. ఆ తర్వాత ఒక్క గోల్ కూడా న మోదుకాలేదు.

సెమీస్‌కు ఫెదరర్
మెల్బోర్న్, జనవరి 26: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్స్ చేరి, ఫైనల్‌లో స్థానం కోసం ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌తో పోరాడనున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను ఆరోసీడ్ థామస్ బెర్డిచ్‌పై 7-6, 6-2, 6-4 తేడాతో గెలిచాడు. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోకపోవడంతో మిగతా రెండు సెట్లలో బెర్డిచ్ నీరుగారిపోయాడు. ఫెదరర్ విజృంభణకు ఎదురునిలవలేకపోయాడు. సులభంగానే నెగ్గిన ఫెదరర్ గత 13 సంవత్సరాల్లో 12వసారి ఈ టోర్నీలో సెమీస్ చేరాడు.
ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో అతను జపాన్ క్రీడాడారుడు, ఏడోసీడ్ కెయ్ నిషికోరిని 6-3, 6-2, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. సెమీస్‌లో అతనికి ఫెదరర్ ఎదురుకానుండడం విశేషం. ఇప్పటి వరకూ 44 మ్యాచ్‌ల్లో ఢీకొన్నారు. చెరి 22 విజయాలు సాధించి సమవుజ్జీగా నిలిచారు. అయితే, ఇటీవల కాలంలో ఫెదరర్‌పై నొవాక్ సాధించిన విజయాలే ఎక్కువగా ఉండడంతో, సెమీస్‌లో అతనినే హాట్ ఫేవరిట్‌గా విశే్లషకులు పేర్కొంటున్నారు.

మహిళల టి-20లో భారత్ గెలుపు
అడెలైడ్, జనవరి 26: ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. విజయానికి అవసరమైన 141 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే అధిగమించింది. గతంలో ఆస్ట్రేలియాపై మరే జట్టు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అలిసా హీలీ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. అలెక్స్ బ్లాక్‌వెల్ 27 (నాటౌట్), బేత్ మూనీ 36 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 26 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మందన 29, వేదా కృష్ణమూర్తి 35, హర్‌మన్‌ప్రీత్ కౌర్ 46 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జెస్ జొహానె్సన్ 24 పరుగులకు రెండు, మెగాన్ స్కట్చ్ 23 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు.