క్రీడాభూమి

విదేశాల్లో శిక్షణా శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: అంతర్జాతీయ ఈవెంట్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలంటే అందుకు తగిన సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నది. క్రమం తప్పకుండా విదేశాల్లో ఏడాదికి కనీసం రెండు పర్యాయాలు శిక్షణా శిబిరాలను నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భారత రెజ్లింగ్ అధికారులకు ఆమె సూచించింది. ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్)లో తాను పోటీపడుతున్న ఢిల్లీ సుల్తాన్స్ ఫ్రాంచైజీ లోగో ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌కు ముందు తాను స్పెయిన్‌లో శిక్షణ పొందినట్టు చెప్పింది. విదేశాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తే, వేర్వేరు విధానాల్లో పోటీపడే రెజ్లర్ల వ్యూహాలను తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ జకార్తాలో జరిగే ఆసియా క్రీడలు, గోల్డ్ కోస్ట్‌లో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో టైటిళ్లను సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. 58 కిలోల విభాగంలోనే పోటీపడతానని, దీనిని మార్చుకోవాలన్న ఆలోచన ఏదీ తనకు లేదని తెలిపింది.

చిత్రం..సాక్షి మాలిక్