క్రీడాభూమి

ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిన్ కేశవన్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగానో (జపాన్), డిసెంబర్ 23: భారత వింటర్ ఒలింపియన్ శివ కేశవన్ ఇక్కడ జరిగిన ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఒకానొక దశలో గంటకు 130.4 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన అతను రెండో హీట్‌ను ఒక నిమిషం, 39.962 సెకన్లలో పూర్తి చేశాడు. ఆ టైమింగ్ అతనికి స్వర్ణాన్ని సంపాదించిపెట్టింది. జపాన్‌కు చెందిన తనకా షోహే ఒక నిమిషం, 44.874 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి రజత పతకాన్ని అందుకున్నాడు. ఒక నిమిషం, 45.120 సెకన్లలో గమ్యాన్ని చేరిన లియెన్ తె ఆన్ (చైనీస్ తైపీ)కు కాంస్య పతకం లభించింది. కాగా, కేశవన్ వచ్చే ఏడాది ఇనాస్‌బ్రక్ (ఆస్ట్రియా)లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్, 2018లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటాడు.

చిత్రం.. శివ కేశవన్