క్రీడాభూమి

టోక్యో ఒలింపిక్స్ బడ్జెట్‌లో కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, డిసెంబర్ 24: జపాన్ ఒకవైపు 2020 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతుండగా, అక్కడి ప్రభుత్వం బడ్జెట్‌లో కోత పెట్టింది. మొత్తం 17 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయడానికి వీల్లేదని ఒలింపిక్ నిర్వాహణ కమిటీ (ఒసి)ని ఆదేశించింది. బ్రెజిల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో అక్కడ ఒలింపిక్స్‌ను నిర్వహించడంతో నానా గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. విద్యార్థుల నుంచి పోలీసుల వరకూ, గృహిణుల నుంచి కార్మికుల వరకూ అందరూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోడ్డుకెక్కారు. ప్రదర్శనలు నిర్వహించారు. ఒకానొక దశలో ఒలింపిక్స్ సజావుగా జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు తలెత్తాయి. ముందుగా అంచనా వేసిన ఖర్చుకు, వాస్తవంగా చేసిన ఖర్చుకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో బ్రెజిల్ వీధిన పడాల్సి వచ్చింది. ప్రజా ధనాన్ని ఒలింపిక్స్‌కు మళ్లించి దారుణంగా దెబ్బతిన్నది. దీని ప్రభావం కనీసం పదేళ్లు ఉంటుందని అంటున్నారు. కాగా, బ్రెజిల్ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో జపాన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ ఖర్చు కనీసం 30 బిలియన్ డాలర్ల వరకూ చేరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒసి ఈ ఖర్చును 20 బిలియన్ డాలర్లుగా చెప్తున్నా, అది అనుకున్నంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే, జపాన్ ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఎక్కువలో ఎక్కువ 17 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి వీల్లేదంటూ బడ్జెట్‌లో కోత పెట్టింది. ఇలావుంటే, రియో ఒలింపిక్స్‌కు 12 బిలియన్ డాలర్లు ఖర్చయిందని, కాబట్టి టోక్యో ఒలింపిక్స్‌కు సుమారు 13 నుంచి 16 బిలియన్ డాలర్ల వరకూ అవసరమవుతాయని ఒసి అభిప్రాయం. జపాన్ సర్కారు ఇదే విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని, బడ్జెట్‌ను 17 బిలియన్ డాలర్లకు ఖాయం చేసింది. అంతేగాక, అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి), టోక్యో ప్రభుత్వాలతో జపాన్ కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నది. బడ్జెట్‌ను పెంచడానికి అనుమతించబోమని, చివరి క్షణాల్లో గందరగోళం పడేకంటే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒసి అధికారులను ఆదేశించింది. టోక్యో గవర్నర్ యురికో కొయికే కూడా ఖర్చులను తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. రియో ఒలింపిక్స్ సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితులు టోక్యోలో పునరావృతం కాకుండా చూస్తామని అంటున్నాడు. మొత్తం మీద టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ ఇప్పటి నుంచే పటిష్టమైన వ్యూహ రచన చేయడం, ఖర్చు భారీగా పెరగకుండా చర్యలు తీసుకోవడం శుభ పరిణామాలని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.