క్రీడాభూమి

భవిష్యత్తుపై బాక్సర్ల ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: నాలుగేళ్లు వేధించిన సమస్యకు తెరపడడంతో, తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భారత బాక్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత బాక్సింగ్ సంఘంపై నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు రావడంతో, అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) దానిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆతర్వాత నాలుగేళ్లు భారత్‌కు బాక్సింగ్ సంఘంగానీ, సమాఖ్యగానీ లేకపోవడంతో, వివిధ అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతకం కనిపించలేదు. భారత బాక్సర్లు ఆయా సమాఖ్యలు లేదా ఆసియా ఒలింపిక్ సంఘం, అంతర్జాతీయ ఒలింపిక్ మండలి జెండాలతో మార్చ్ఫిస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. శిక్షణ నుంచి అంతర్జాతీయ పోటీల వరకూ అడుగడుగునా భారత బాక్సర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఏడాది భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) ఏర్పడింది. దీనికి ఎఐబిఎ గుర్తింపు కూడా లభించింది. దీనితో నాలుగేళ్లుగా పడుతున్న యాతన నుంచి బాక్సర్లు బయటపడ్డారు. వచ్చే ఏడాది భారత బాక్సింగ్ రంగం ఉన్నత ప్రమాణాలను సంతరించుకుంటుందని, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రో బాక్సింగ్‌తో కొత్త ఊపు
విజేందర్ సింగ్ విజయాలను చూసిన తర్వాత చాలా మంది బాక్సర్లు అతని అడుగుజాడల్లో నడుస్తూ ప్రో బాక్సర్లుగా మారేందుకు పోటీపడుతున్నారు. బాక్సింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకుంటే, పేరుప్రఖ్యాతులతోపాటు భారీగా పారితోషికాలు కూడా లభిస్తాయని విజేందర్ ఇప్పటికే నిరూపించాడు. పొఫెషనల్ బాక్సర్‌గా అవతరించిన తర్వాత విజేందర్ వరుసగా ఎనిమిది నాకౌట్ విజయాలను సాధించాడు. నిరుడు అతను మూడు ఫైట్స్‌లో పాల్గొన్నాడు. అక్టోబర్ 10న సోనీ వైటింగ్‌ను, జూలై 11న డియాన్ గిలెన్‌ను, డిసెంబర్ 19న సమెట్ హ్యుసెనోవ్‌ను చిత్తుచేశాడు. ఈ మూడు నాకౌట్ విజయాలే. ఈఏడాది మార్చి 12న అలెగ్జాండర్ హోర్వర్త్, ఏప్రిల్ 30న మాటియోగ్ రాయర్, మే 13న ఆండ్రెజ్ సొల్డ్రా, జూలై 16న కెర్రీ హోప్‌లపై నాకౌట్ విజయాలను నమోదు చేశాడు. తాజాగా ఫ్రాన్సిస్కా చెకాను ఓడించి, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను సాధించాడు. అతనిని ఆదర్శంగా తీసుకున్న పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా అవతారం ఎత్తారు.
తాజాగా మహిళా బాక్సర్ సరితా దేవి కూడా ప్రో బాక్సర్‌గా మారింది. మొత్తం మీద విజేందర్ కొత్త ట్రెండ్‌ను సృష్టించగా, అతని మార్గాన్ని అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. బిఎఫ్‌ఐకి ఎఐబిఎ గుర్తింపు, ప్రొఫెషనల్ లీగ్‌లు, చాంపియన్‌షిప్‌లు భారత బాక్సింగ్ కొత్త రూపాన్ని సంతరించి పెడుతున్నాయి. వచ్చే ఏడాది భారత బాక్సింగ్ కొత్త పోకడలతో, సరికొత్తగా దర్శనమిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ శుభ పరిణామాలేనని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

చిత్రం..విజేందర్ సింగ్