క్రీడాభూమి

సాన్‌టినా జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 26: ‘సాన్‌టినా’గా పేరుపొందిన సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వీరు అనా లెనా గ్రొన్‌ఫెల్డ్, కొకొ వాండెవెగ్ జోడీని 6-2, 4-6, 6-1 తేడాతో ఓడించారు. వీరికి ఇది వరుసగా 34వ విజయం. రెండో సెట్‌లో గ్రొన్‌ఫెల్డ్, వాండెవెగ్ జోడీ గట్టిపోటీనిచ్చి గెలిచినప్పటికీ, కీలకమైన చివరి సెట్‌లో సానియా, హింగిస్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. ఫైనల్‌లో స్థానం కోసం ఈ జోడీ జూలియా జార్జెస్, కరోలినా ప్లిస్కోవా జోడీతో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో జార్జెస్, ప్లిస్కోవా జోడీ 6-2, 6-4 ఆధిక్యంతో వనియా కింగ్, అలా కుద్రియత్సెవా జోడీని ఓడించింది. ఇలావుంటే చాన్ హవో చింగ్, చాన్ యుంగ్ జాన్ జోడీపై 2-6, 7-5, 6-3 స్కోరుతో గెలుపొందిన ఆండ్రియా హ్లవకొవా, లూసీ హ్రాడెకా జోడీ సెమీస్ చేరింది.
సానియా వర్సెస్ పేస్: మిక్స్‌డ్ డబుల్స్ విభాగం క్వార్టర్ పైనల్స్‌లో సానియా మీర్జా, లియాండర్ పేస్ మధ్య పోరు సాగనుంది. ఇవాన్ డోడింగ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడుతున్న సానియా రెండో రౌండ్‌లో యారొస్లొవా స్వెడొవా, ఐసమ్ అల్ ఖురేషీ జోడీపై 7-5, 6-2 విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. మరోవైపు సానియాతో కలిసి మహిళల డబుల్స్‌లో ఆడుతున్న మార్టినా హింగిస్ భాగస్వామిగా మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీపడుతున్న లియాండర్ పేస్ కూడా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు. పేస్, హింగిస్ జోడీ రెండో రౌండ్‌లో స్లొయేన్ స్టెఫెన్స్, జీన్ జులియన్ రొజర్ జోడీని 6-1, 6-2 తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సానియాకు పేస్, హింగిస్ జోడీ ఎదురవుతుంది.