క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌కు డెల్ పొట్రో దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, డిసెంబర్ 24: వచ్చేనెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ డెల్ పొట్రో పాల్గొనడం లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 38వ స్థానంలో ఉన్న డెల్ పొట్రో చాలాకాలంగా ఫిట్నెస్ సమస్యతో సతమతమవుతున్నాడు. గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనడం లేదని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. ఆరు అడుగుల, ఆరు అంగుళాల పొడవుతో దృఢంగా ఉండే డెల్ పొట్రో న్యూజిలాండ్‌లో జరిగే ఒక ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఫిట్నెస్ సమస్యలతో అతను ఈ పోటీలతోపాటు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి కూడా వైదొలిగాడు.

చిత్రం..జువాన్ డెల్ పొట్రో