క్రీడాభూమి

వనే్డ సిరీస్‌పై కివీస్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 25: టీవల కాలంలో ఎదురైన వరుస సిరీస్ పరాజయాల నుంచి గట్టెక్కడానికి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌ను సరైన వేదికగా న్యూజిలాండ్ ఎంచుకుంది. భారత్‌లో పర్యటించినప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కోల్పోయిన కివీస్, ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో కొంత మెరుగ్గానే ఆడింది. కానీ, చివరికి 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత ఆస్ట్రేలియా వెళ్లి దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. ఈ ఓటమి బాటను తప్పించుకొని, మళ్లీ ఫామ్‌లోకి రావడానికి బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మించిన అవకాశం లేదని భావిస్తున్నది. స్వదేశంలో మ్యాచ్‌లు ఆడడం, బంగ్లాదేశ్ లాంటి సాధారణ జట్టు ప్రత్యర్థి కావడం విజయాలపై కివీస్ ఆశలు పెట్టుకుంది. సోమవారం జరిగే మొదటి వనే్డని గెల్చుకొని, శుభారంభం చేయాలని చూస్తున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కివీస్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ది ఏడో స్థానం. ర్యాంకింగ్‌లోనేగాక, జట్ల బలాబలాలను చూసినా న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తున్నది. హోం అడ్వెంటేజీతో కేన్ విలియమ్‌సన్ నేతృత్వంలోని కివీస్ వనే్డ సిరీస్‌ను గెల్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డనుంది.