క్రీడాభూమి

ఇప్పుడే రిటైర్ కాను: అఫ్రిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 25: తనకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా ఒక మ్యాచ్‌ని ఎంపిక చేయాలని కోరుకోవడం లేదని పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ స్పష్టం చేశాడు. జట్టులో స్థానం లభించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వస్తున్న వార్తలను అతను ఖండించాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని అఫ్రిదీ తేల్చిచెప్పాడు. కాగా, అఫ్రిదీకి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం లేనకేట్ట కనిపిస్తున్నది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో వెస్టండీస్‌తో జరిగే సిరీస్‌లో చివరి టి-20 మ్యాచ్‌ని ఆడించిన తర్వాత అన్ని ఫార్మెట్స్ నుంచి వైదొలగుతున్నట్టు అతనితో ప్రకటన చేయించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్, చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ నిర్ణయించారు. అఫ్రిదీని 16వ సభ్యుడిగా విండీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చేరుస్తామని ప్రకటించారు. అయితే, గుండె పోటుకు గురైన హషర్యార్ లండన్‌లో చికిత్స పొందిన తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా, పాలక మండలికి నాయకత్వం వహించిన సీనియర్ సభ్యుడు నజామ్ సేథీ ఇటీవల జరిగిన సమావేశంలో అఫ్రిదీకి చివరి మ్యాచ్ ఆడే అవకాశం కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. పిసిబి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం విండీస్‌కు వెళ్లే జట్టులో 16వ సభ్యుడిగా అఫ్రిదీని ఎంపిక చేస్తే, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని, అంతేగాక, ఒక దుష్ట సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినట్టు అవుతుందని సేథీ వ్యాఖ్యానించాడు. అఫ్రిదీ ఇప్పటికీ మ్యాచ్‌లు ఆడగల సమర్థుడేనని సెలక్టర్లు అనుకుంటే, 15 మందితో కూడిన జట్టులో అతనికి ఎందుకు స్థానం కల్పించలేదని నిలదీశాడు. దొడ్డిదారిన జట్టులో చేర్చుకోవడం అఫ్రిదీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని హెచ్చరించాడు. కాగా, సేథీ అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాత అఫ్రిదీకి వీడ్కోలు మ్యాచ్‌లో అవకాశం కల్పించాలన్న ఆలోచనకు పిసిబి స్వస్తి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, తన వీడ్కోలు మ్యాచ్ గురించి తాను ఎవరిపైనా ఆధారపడలేదని వ్యాఖ్యానించాడు. ఆ అవసరం కూడా తనకు లేదన్నాడు. ఒక ప్రశ్నకు సమాధామిస్తూ, ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా భారత్ సానుకూలంగా స్పందించడం లేదని ఆరోపించాడు. రెండు దేశాల మధ్య మ్యాచ్‌లను అభిమానులు కోరుకుంటున్నారని అన్నాడు. త్వరలోనే వారి ఆకాంక్ష నెరవేరుతుందని నమ్ముతున్నట్టు అఫ్రిదీ చెప్పాడు.