క్రీడాభూమి

విజయమే ఆసీస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 25: దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, చివరి టెస్టును గెల్చుకోవడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియాకు పాకిస్తాన్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టు మరింత ఉతాత్సహాన్నిచ్చింది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి, సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆసీస్ సోమవారం నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక ‘బాక్సింగ్ డే’ టెస్టులోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ టెస్టును ఖాతాలో వేసుకుంటే, చివరి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా సిరీస్‌ను సాధిస్తుంది. లో స్కోరింగ్ మ్యాచ్‌గా కొనసాగిన మొదటి టెస్టులో పాకిస్తాన్ చివరి వరకూ పోరాడింది. 490 పరుగుల భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ, పాక్ ఆందోళన చెందలేదు. ఒకానొక దశలో లక్ష్యాన్ని ఛేదించే అవకాశాలు కనిపించాయి. మొత్తం మీద చివరి వరకూ పోరాడిన పాక్ కేవలం 39 పరుగుల తేడాతో ఓడింది. అతి కష్టం మీద విజయం సాధించినప్పటికీ, పాక్ పోరాట పటిమ ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని స్మిత్ బృందం గ్రహించింది. అందుకే, రెండో టెస్టులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ, ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు సిద్ధమైంది.
పాక్‌ను ఎంసిజి ఆదుకుంటుందా?
ఆస్ట్రేలియాలో ఆడిన గత 10 టెస్టుల్లోనూ పరాజయాలను చవిచూసిన పాకిస్తాన్‌ను మెల్బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసిజి) ఆదుకుంటుందో లేదో చూడాలి. ఈ మైదానంలో పాక్ చివరిసారి టెస్టును గెల్చుకొని 35 సంవత్సరాలైంది. 1981లో చివరిసారి ఎంసిజిలో పాక్ విజయాన్ని నమోదు చేసింది. ఆతర్వాత ఎన్నడూ ఆసీస్‌లో పాక్ సఫలం కాలేదు. మూడున్నర దశాబ్దాల క్రితం విజయాన్ని అందించిన ఎంసిజి మరోసారి ఆదుకుంటుందేమోనని పాక్ జట్టు ఆశాభావంతో ఉంది. కాగితంపై చూస్తే, యువ, సీనియర్ ఆటగాళ్లతో సమతూకంగా ఉన్న పాకిస్తాన్‌కు ఎంసిజిలో విజయం సులభసాధ్యం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు.