క్రీడాభూమి

కుంబ్లే, కోహ్లీ ప్రోత్సాహమే జూనియర్లకు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే, టెస్టు పార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రోత్సాహమే యువ క్రికెటర్లకు బలాన్నిస్తున్నది, ఇది శుభసూచకమని భారత్ ‘ఎ’, అండర్-19 క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ కుంబ్లే, కోహ్లీ కారణంగానే కరుణ్ నాయర్, జయంత్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగలిగారని చెప్పాడు. వారిద్దరూ యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నారని, వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూస్తున్నారని ప్రశంసించాడు. భారత్ ‘ఎ’ జట్టు నుంచే నాయర్, యాదవ్ జాతీయ జట్టులోకి వచ్చారని అంటూ, కోచ్, కెప్టెన్ ఆదరణ, సహకారం లేకపోతే కొత్తగా జట్టులోకి వచ్చే వారు ఎవరూ రాణించే అవకాశాలు ఉండవని స్పష్టం చేశాడు. కెరీర్‌లో మూడో టెస్టు ఇన్నింగ్స్‌లోనే నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడం అద్భుతమని ప్రశంసించాడు. అతను తన తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని చెప్పాడు. లోకేష్ రాహుల్, జయంత్ యాదవ్ గొప్పగా రాణించారని కొనియాడాడు.

చిత్రం..రాహుల్ ద్రవిడ్