క్రీడాభూమి

లాథమ్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 26: ఓపెనర్ టామ్ లాథమ్ శతకంతో కదంతొక్కగా, బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్ 77 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 341 పరుగుల భారీ స్కోరు చేయగా, అందుకు సమాధానంగా బంగ్లాదేశ్ 44.5 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, లాథమ్ క్రీజ్‌లో నిలదొక్కుకొని స్కోరును ముందుకు దూకించాడు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (31), నీల్ బ్రూమ్ (22), జిమీ నీషమ్ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. లాథమ్ 121 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 137 పరుగులు సాధించి, ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ముస్త్ఫాకర్ రహీం క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. చివరిలో కొలిన్ (87) ధాటిగా ఆడాడు. ల్యూక్ రోన్చీ 8 పరుగులకు అవుట్‌కాగా, సాంట్నర్ 8, టిమ్ సౌథీ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
టాప్ ఆర్డర్ విఫలం
న్యూజిలాండ్‌ను ఓడించడానికి 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, తీవ్రమైన ఒత్తిడికి గురైన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ విఫలమైంది. ఇమ్రుల్ ఖయాస్ (16), సౌమ్య సర్కార్ (1), మహమ్మదుల్లా (0), తమీమ్ ఇక్బాల్ (38) వికెట్లు పారేసుకున్నారు. అయితే, మిడిల్ ఆర్డర్‌లో షకీబ్ అల్ హసన్ (59), ముష్ఫికర్ రహీం (42 రిటైర్డ్ హర్ట్), మొసాడెక్ హొస్సేన్ (50 నాటౌట్) జట్టును ఆదుకోవడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించడంతో బంగ్లాదేశ్ స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. కానీ, అసాధ్యంగా మారిన లక్ష్యాన్ని ఛేదించలేక 264 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో నీషమ్, ఫెర్గూసన్ చెరి 3 వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 341 (టామ్ లాథమ్ 137, కొలిన్ మున్రో 87, షకీబ్ అల్ హసన్ 3/69, తస్కిన్ అహ్మద్ 2/70, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/62).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 44.5 ఓవర్లలో 264 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 38, షకీబ్ అల్ హసన్ 59, ముష్ఫికర్ రహీం 42, మొసాడెక్ హొస్సేన్ 50 నాటౌట్, జిమీ నీషమ్ 3/36, ఫెర్గూసన్ 3/54, టిమ్ సౌథీ 2/63).

చిత్రం..సెంచరీ హీరో లాథమ్