క్రీడాభూమి

అజర్ అలీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 27: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అజర్ అలీ అజేయ శతకంతో సత్తా చాటుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది. సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌కు వర్షం వలన అంతరాయం ఏర్పడటంతో తొలి రోజు 50.5 ఓవర్లు మాత్రమే ఆడిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నష్టపోయి 142 పరుగులు సాధించిన విషయం విదితమే. ఆ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ జట్టుకు మరోసారి వర్షం పదేపదే అంతరాయాన్ని కలిగించినప్పటికీ నైట్ వాచ్‌మన్లు అజర్ అలీ, అసద్ షఫిక్ 115 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం షఫిక్ 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో స్మిత్‌కు దొరికిపోగా, అతని స్థానంలో దిగిన వికెట్ కీపర్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ 10 పరుగులు సాధించి హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఈ తరుణంలో అజర్ అలీ (139), మహమ్మద్ అమీర్ (28) స్థిమితంగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. వీరిద్దరూ అజేయంగా 28 పరుగులు జోడించిన తర్వాత మరోసారి వర్షం కురవడంతో మంగళవారం 50.3 ఓవర్లకే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటికి పాకిస్తాన్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్సన్ బర్డ్ మూడు వికెట్లు, జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు, నాథన్ లియాన్‌కు ఒక వికెట్ చొప్పున లభించాయి.

చిత్రం..అజర్ అలీ (139-నాటౌట్)